Kiran Abbavaram: మైథాలజీ యాక్షన్ స్టోరీతో కిరణ్ అబ్బవరం పాన్ ఇండియా మూవీ.. హీరోయిన్, డైరెక్టర్ ఎవరో తెలుసా?

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. 'క' సినిమాతో 50 కోట్ల క్లబ్ లో చేరిన ఈ హీరో కే ర్యాంప్ తో మరో సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు మరోసారి పాన్ ఇండియా మూవీతో ఆడియెన్స్ ను అలరించేందుకు రెడీ అయ్యాడీ ట్యాలెంటెడ్ హీరో.

Kiran Abbavaram: మైథాలజీ యాక్షన్ స్టోరీతో కిరణ్ అబ్బవరం పాన్ ఇండియా మూవీ.. హీరోయిన్, డైరెక్టర్ ఎవరో తెలుసా?
Kiran Abbavaram

Updated on: Feb 10, 2026 | 7:19 PM

ప్రఖ్యాత నిర్మాత ప్రేరణ అరోరా (Ess Kay Gee Entertainment), జీ స్టూడియోస్ అధినేత ఉమేష్ బన్సాల్ తో కలిసి టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా ఒక భారీ పాన్-ఇండియా చిత్రంను నిర్మించనున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన కథతో, అద్భుతమైన విజువల్స్‌తో ఈ సినిమాను మిథాలజీ యాక్షన్ ఎంటర్టైనర్‌ గా తెరకెక్కించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు కీర్తన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, గ్రాండ్ విజువల్స్, వరల్డ్ బిల్డింగ్, హై టెక్నికల్ వాల్యూస్‌తో సినిమాను నిర్మించేలా పనులు ప్రారంభమయ్యాయి. ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదే సమయంలో హీరోయిన్ ఎంపికపై బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీమణుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. సినిమా టైటిల్, దర్శకుడు, ఇతర నటీనటులు మరియు సాంకేతిక బృంద వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

కాగా భక్తి, భావోద్వేగాలు, డ్రామా, హై-వోల్టేజ్ యాక్షన్‌ను సమన్వయం చేస్తూ రూపొందుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కాగా ‘క’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయ్యాడు కిరణ్ అబ్బవరం. ఈ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ భారీ కలెక్షన్లు సాధించింది. మధ్యలో ఒక సినిమా నిరాశపర్చినా కే- ర్యాంప్ తో మరో సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. ప్రస్తుతం ఈ నటుడి చేతిలో చెన్నై లవ్ స్టోరీతో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

కిరణ్ అబ్బవరం సరసన టాప్ హీరోయిన్..

చెన్నై లవ్ స్టోరీ సినిమాలో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us