సూపర్‌స్టార్ అనుకుని తప్పులో కాలేసిన ఖుష్బూ..

| Edited By: Srinu

Aug 30, 2019 | 7:48 PM

ఒకరిని పోలి మరొకరు ఉండటం సహజం. టెక్నాలజీ కొంతపుంతలు తొక్కుతున్న ఆధునిక కాలంలో సోషల్ మీడియాలో కొన్నిఏది ఒరిజినల్ అనేది తేల్చుకోవడం అంత సులభం కాదేమో. కొన్ని మార్ఫింగ్ చేసిన ఫోటోలు మనల్ని పప్పులో కాలు వేసేలా చేస్తాయి. అయితే మరికొన్ని పొరబాటు పడేలా చేస్తాయి. సరిగ్గా తలైవా రజనీకాంత్ విషయంలో అదే జరిగింది. దక్షిణాది నటి ఖుష్బూ లండన్‌లో షాపింగ్ చేస్తుండగా ఆమెకు అక్కడ మొబైల్ బ్యాక్ కవర్‌పై తమీమ్ బొమ్మను పోటో తీసి తన […]

సూపర్‌స్టార్ అనుకుని తప్పులో కాలేసిన ఖుష్బూ..
Follow us on

ఒకరిని పోలి మరొకరు ఉండటం సహజం. టెక్నాలజీ కొంతపుంతలు తొక్కుతున్న ఆధునిక కాలంలో సోషల్ మీడియాలో కొన్నిఏది ఒరిజినల్ అనేది తేల్చుకోవడం అంత సులభం కాదేమో. కొన్ని మార్ఫింగ్ చేసిన ఫోటోలు మనల్ని పప్పులో కాలు వేసేలా చేస్తాయి. అయితే మరికొన్ని పొరబాటు పడేలా చేస్తాయి. సరిగ్గా తలైవా రజనీకాంత్ విషయంలో అదే జరిగింది.

దక్షిణాది నటి ఖుష్బూ లండన్‌లో షాపింగ్ చేస్తుండగా ఆమెకు అక్కడ మొబైల్ బ్యాక్ కవర్‌పై తమీమ్ బొమ్మను పోటో తీసి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ” లండన్‌లోని ఆక్స్‌ఫోర్డ్ స్ట్రీట్‌లోని షాపింగ్ మాల్‌లో నాకు ఏం కనిపించిందో చూడండి.. మన సూపర్ స్టార్ రజనీకాంత్ ” అంటూ రజనీ కుమార్తె సౌందర్యకు టాగ్ చేసింది. అయితే ఖుష్బూ తప్పులో కాలేసిందని గమనించిన నెటిజన్లు చురకలంటించారు. తమీమ్‌కి తలైవాకీ తేడా తెలియలేదా అంటూ కామెంట్స్ చేశారు. దీంతో చేసిన పొరబాటును గుర్తించిన ఖుష్బూ వెంటనే క్షమాపణలు చెబుతూ .. ఆయన సూపర్‌స్టార్ రజనీకాంత్ కారు .. నన్ను నేను సరిచేసిన స్నేహితులకు కృతఙ్ఞతలు అంటూ పేర్కొంది. తప్పును ఒప్పుకోవడం అంటే మీరు ఎదుగుతున్నారని అర్ధం.

మనుషులు తప్పు చేస్తారు. వాటి నుంచే చాల నేర్చుకుంటారు అంటూ పోస్ట్ చేసింది ఖష్బూ. పొరబాటు సహజం కదా.. ఖుష్బూ వెంటనే దాన్ని సరిదిద్దుకోవడంతో ఆమెను ఇప్పుడు పొడుగుతున్నారు నెటిజన్లు.