Keerthy Suresh: పెళ్లి డేట్ ఫిక్స్.. వైరల్ అవుతున్న కీర్తి సురేష్ పెళ్లి కార్డు..

|

Dec 04, 2024 | 1:59 PM

అందాల భామ కీర్తిసురేష్ పెళ్లి కూతురు అయ్యింది. ఈ ముద్దుగుమ్మ త్వరలో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెట్టనుంది. తన స్నేహితుడిని కీర్తిసురేష్ ప్రేమించి పెళ్లి చేసుకోనుంది.

Keerthy Suresh: పెళ్లి డేట్ ఫిక్స్.. వైరల్ అవుతున్న కీర్తి సురేష్ పెళ్లి కార్డు..
Actress Keerthy Suresh
Follow us on

అందాల భామ  కీర్తి సురేష్ పెళ్లికూతురు కాబోతుంది. ఈ ముద్దుగుమ్మ పెళ్లి కోసం ఆమె అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కీర్తిసురేష్  ఆంథోనీ అట్చి ను వివాహం చేసుకోనుంది. కీర్తిసురేష్, అతను చాలా కాలంగా ఫ్రెండ్స్.  ఆతర్వాత ప్రేమలో పడి.. ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కనున్న. తాజాగా వీరి పెళ్లి తేదీ ఫిక్స్ అయ్యింది. డిసెంబర్ 12న గోవాలో వీరి వివాహ వేడుకలు జరగనున్నాయి. ఈ పెళ్లివేడుకకు కొద్దిమంది అతిథులు, సన్నిహిత కుటుంబం, స్నేహితులు మాత్రమే హాజరుకానున్నారని తెలుస్తుంది. కీర్తి పెళ్లికి సంబంధించిన వివాహ ఆహ్వాన పత్రం బయటకు వచ్చింది. వివాహం వ్యక్తిగత వేడుకగా జరుగుతుందని, అందరి ప్రార్థనలు, ఆశీస్సులు ఉండాలని పత్రికలో పేర్కొన్నారు.

ఇంజనీర్ అయిన ఆంథోనీ ఇప్పుడు పూర్తి స్థాయి వ్యాపారవేత్త అయ్యాడు. అతనికి కేరళలో ఆస్పెరోస్ విండోస్ సొల్యూషన్స్ ఉంది. ఇటీవలే కీర్తి తిరుమల శ్రీ వారిని దర్శించుకుంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే పెళ్లి గురించి అప్డేట్ కూడా ఇచ్చింది. కీర్తి వెంట ఆమె తండ్రి సురేష్ కుమార్, తల్లి మేనకా సురేష్, సోదరి రేవతి సురేష్ కూడా తిరుపతికి వచ్చారు.. ఇదిలా ఉంటే 12వ తేదీ ఉదయం హిందూ సంప్రదాయ ఆచారాల ప్రకారం వివాహం జరుగుతుందని తెలుస్తోంది. ఈ వేడుకలో  కీర్తి హిందూ తమిళ బ్రాహ్మణ స్టైల్ డ్రెస్‌లో కనిపించనుందని సమాచారం. అతిథులకు ప్రత్యేక డ్రెస్ కోడ్ కూడా ఉండనుంది. సాయంత్రం మరో ఫంక్షన్ కూడా ఉండనుంది. ఇక రాత్రి క్యాసినో నైట్ పార్టీతో వివాహ వేడుకలు ముగుస్తాయి.

రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆంథోనీతో ఉన్న ఫోటోను షేర్ చేసి కీర్తి పెళ్లి వార్తలపై స్పందించింది. ఇది 15 ఏళ్లుగా కొనసాగుతున్న బంధమని  స్పష్టం చేసింది. కీర్తిసురేష్ తెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది.  తెలుగులో మహానటి చిత్రానికి గానూ కీర్తి ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కూడా  అందుకుంది. ఈ ముద్దుగుమ్మ బేబీ జాన్‌తో బాలీవుడ్‌లో అరంగేట్రం చేయబోతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.