Katrina Kaif: కత్రినా కైఫే వారికి దేవత.. 11ఏళ్లుగా స్టార్ హీరోయిన్‌కు పూజలు చేస్తున్న భార్య భర్తలు

|

Jul 18, 2024 | 1:08 PM

ఖుష్బూ, నమిత, నిధి అగర్వాల్.. మొనీమధ్య సమంత ఇలా చాలామంది హీరోయిన్స్ ను దేవతలుగా భావించి పూజిస్తుంటారు కొందరు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కు ఓ జంట నిత్యం పూజలు చేస్తున్నారు. కత్రినా కైఫ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు బాలీవుడ్ లో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్. పిల్లల నుంచి పెద్దల వరకు కత్రినాకు చాలామంది అభిమానులు ఉన్నారు.

Katrina Kaif: కత్రినా కైఫే వారికి దేవత.. 11ఏళ్లుగా స్టార్ హీరోయిన్‌కు పూజలు చేస్తున్న భార్య భర్తలు
Katrina Kaif
Follow us on

చాలా మంది ప్రేక్షకులు హీరోయిన్స్ ను ఎంతగానో ఆరాధిస్తూ ఉంటారు. తమ ఫెవరెట్ హీరోయిన్ ఫొటోలతో సోషల్ మీడియాను షేర్ చేస్తుంటారు. అలాగే తమ ఫెవరెట్ హీరోయిన్స్ పై సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్ లు షేర్ చేస్తూ ఉంటారు. ఇక ఆ హీరోయిన్స్ సినిమాలు రిలీజ్ అయితే పణంగా చేస్తుంటారు. అయితే మన దేశంలో హీరోయిన్స్ కు గుడులు కూడా కట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఖుష్బూ, నమిత, నిధి అగర్వాల్.. మొనీమధ్య సమంత ఇలా చాలామంది హీరోయిన్స్ ను దేవతలుగా భావించి పూజిస్తుంటారు కొందరు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కు ఓ జంట నిత్యం పూజలు చేస్తున్నారు. కత్రినా కైఫ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు బాలీవుడ్ లో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్. పిల్లల నుంచి పెద్దల వరకు కత్రినాకు చాలామంది అభిమానులు ఉన్నారు. కత్రినా తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూనే ఉంటుంది.

ఇది కూడా చదవండి : నన్ను చూసి తట్టుకోలేవు.. నువ్వు రావొద్దు అన్నాడు.. కన్నీళ్లు పెట్టుకున్న బ్రహ్మానందం

తాజాగా కత్రినా తన 41వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే మన దేశంలోని ఒక గ్రామంలో ఒక జంట గత 11 సంవత్సరాలుగా కత్రినాను పూజిస్తున్నారు. ఆమె పుట్టినరోజును కూడా ఘనంగా జరుపుకున్నారు. హర్యానాలోని చర్కీ దాద్రీ జిల్లాకు చెందిన ఓ జంట ప్రతిరోజూ కత్రినాను పూజిస్తారు.

ఇదికూడా చదవండి : Rashmika Mandanna: నువ్వు లేవంటే నమ్మలేకపోతున్నా.. నిన్ను కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది.. రష్మిక ఎమోషనల్ పోస్ట్

ధని ఫోగట్ అనే గ్రామంలో ఉండే కరంబీర్ అలియాస్ బంటు, అతని భార్య సంతోషి కత్రినా కైఫ్‌ను తమ దైవంగా పూజిస్తారు. గత 11 ఏళ్లుగా ఈ జంట కత్రినా పుట్టినరోజు వేడుకలను కేక్ కట్ చేసి లడ్డూ పంచి ఘనంగా జరుపుకుంటున్నారు. తనను కలవడానికి కత్రినా కైఫ్ రావాలని కోరుతున్నారు. ‘‘నేను 13-14 ఏళ్ల నుంచి కత్రినా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాను. పెళ్లికి ముందు నేను కత్రినా పుట్టినరోజును ఒంటరిగా జరుపుకునేవాడిని. ఇప్పుడు నేను, నా భార్య కలిసి పుట్టినరోజులు జరుపుకుంటాము. కత్రినా మా ఇంటికి రావాలని కోరుకుంటున్నాను. కత్రినా తప్పకుండా మమ్మల్ని కలవడానికి వస్తుందని నేను నమ్ముతున్నాను’ అని బంటు చెప్పుకొచ్చాడు. అలాగే అతని భార్య మాట్లాడుతూ.. కత్రినాకు ఇటీవలే 41 ఏళ్లు పూర్తయ్యాయి. మేము ఆమె పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నాము. కత్రినా త్వరలో మమ్మల్ని కలవాలని నేను ప్రార్థిస్తున్నాను. గత 11 ఏళ్లుగా ప్రతిరోజూ ఆమెకు పూజలు చేస్తున్నాం’ అని సంతోషి తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.