బిగ్ బాస్ కన్నడ హోస్ట్ , సౌత్ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు. ఇదిలా ఉంటే సుదీప్ ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. అక్టోబర్ 6, ఆదివారం ప్రసారమైన బిగ్ బాస్ కన్నడ సూపర్ సండే ఎపిసోడ్‌లో, కిచ్చా సుదీప్ చెప్పులు లేకుండా షోను హోస్ట్ చేస్తున్నప్పుడు, ప్రేక్షకులు అతన్ని ఇలా చూసి ఆశ్చర్యపోయారు. నిజానికి బిగ్ బాస్ స్టేజ్‌పైకి ఓ పెద్ద స్టార్ చెప్పులు, బూట్లు లేకుండా షో నిర్వహించడం బిగ్ బాస్ చరిత్రలో ఇదే తొలిసారి
కన్నడ ప్రేక్షకులకు కిచ్చా సుదీప్ అంటే చాలా ఇష్టం. సుదీప్ గత కొన్నేళ్లుగా బిగ్ బాస్ కన్నడ వెర్షన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. చెప్పులు లేకుండా బిగ్ బాస్ హోస్ట్ చేయడానికి గల కారణాన్ని కిచ్చా సుదీప్ వివరిస్తూ, నవరాత్రి కోసం తాను ఉపవాసం ఉన్నానని, అందుకే బూట్లు, చెప్పులు వేసుకోలేదని చెప్పాడు. వాస్తవానికి, నవరాత్రుల పవిత్ర సందర్భంగా తొమ్మిది రోజులు ఉపవాసం ఉండే భక్తులు బూట్లు ధరించరు, అందుకే సుదీప్ సూపర్ సండే ఎపిసోడ్‌ను చెప్పులు లేకుండా కనిపించారు.
సుదీప్ పని కేవలం కన్నడ చిత్రాలకే పరిమితం కాదు. అతను తన కెరీర్‌లో తమిళం, తెలుగు మరియు హిందీ చిత్రాలలో కూడా పనిచేశాడు. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌తో ప్రత్యేక స్నేహం ఉంది. కిచ్చా సుదీప్ కేవలం నటనలోనే కాకుండా నేపథ్యగానంలో కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. ఈగ సినిమాతో పాటు బాహుబలి 1లో ఓ చిన్న పాత్రలో కనిపించాడు. ఇక సుదీప్ నటించే సినిమాలు తెలుగులోనూ రిలీజ్ అవుతున్నాయి.
ಧನರಾಜ್ ಬುಸ್ ಬುಸ್ ಜೋಕ್ಗೆ ಎಲ್ರೂ ಸುಸ್ತೋ ಸುಸ್ತು!
ಸೂಪರ್ ಸಂಡೇ ವಿತ್ ಸುದೀಪ | ಇಂದು ರಾತ್ರಿ 9#BiggBossKannada11 #BBK11 #HosaAdhyaya #ColorsKannada #BannaHosadaagideBandhaBigiyaagide #ಕಲರ್ಫುಲ್ಕತೆ #colorfulstory #Kicchasudeepa pic.twitter.com/prHKEGc5J5
— Colors Kannada (@ColorsKannada) October 6, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.