Kamal Haasan’s Vikram: తుది దశ‌లో కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీ షూటింగ్.. త్వరలోనే రిలీజ్..

|

Dec 25, 2021 | 8:09 PM

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ 232వ సినిమా విక్రమ్ సినిమా డిసెంబర్ 10 నుంచి ఫుల్ స్వింగ్‌లో ఉంది. అయితే ఇటీవలే కమల్ కరోనా భారిన పడటంతో చిన్న గ్యాప్ ఇచ్చారు.

Kamal Haasans Vikram: తుది దశ‌లో కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీ షూటింగ్.. త్వరలోనే రిలీజ్..
Vikram
Follow us on

Vikram: యూనివర్సల్ హీరో కమల్ హాసన్ 232వ సినిమా విక్రమ్ సినిమా డిసెంబర్ 10 నుంచి ఫుల్ స్వింగ్‌లో ఉంది. అయితే ఇటీవలే కమల్ కరోనా భారిన పడటంతో చిన్న గ్యాప్ ఇచ్చారు. ఆ గ్యాప్ తర్వాత రీసెంట్  కమల్ హాసన్ షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రంలో సౌత్ ఇండియన్ స్టార్స్ అయిన ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, నరైన్, కాళిదాస్ జయరాం వంటి వారు నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఆగస్ట్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఎన్నో షెడ్యూల్స్ పూర్తయ్యాయి.

ఇక సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ తరుణంలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ వంటి ప్రముఖ తారాగణంపై సన్నివేశాలనుచిత్రీకరిస్తున్నారు.  ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత కెమెరామెన్ గిరీష్ గంగాధరణ్, ఎడిటర్ ఫిలోమిన్ రాజ్, ఆర్ట్ డైరెక్టర్ సతీష్, కొరియోగ్రఫర్ శాండీ, యాక్షన్ డైరెక్టర్ అంబరివ్‌ పనిచేస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్, కమల్ హాసన్ సంయుక్తంగా విక్రమ్ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తర్వాత కమల్ శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 లో జాయిన్ అవ్వనున్నారని తెలుస్తుంది. అనికొని కారణాల కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. దాంతో శంకర్ రామ్ చరణ్ సినిమా పై ఫోకస్ పెట్టారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Megastar Chiranjeevi: టికెట్స్ రేట్స్ పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి.. ఏమన్నారంటే..

హీరోగా మారనున్న కాంగ్రెస్ కీలక నేత.. పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ ఎవరంటే…

Ghani: గని రిలీజ్ డేట్ వచ్చేసింది.. వరుణ్ తేజ్ సినిమా విడుదల ఎప్పుడంటే..