Tollywood : కండలు తిరిగిన బాడీతో.. అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చిన పాన్ ఇండియా స్టార్.. ఎవరంటే..

ప్రస్తుతం బాక్సాఫీస్ కింగ్ అతడు. ప్రపంచవ్యాప్తంగా తనకంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ వరుస సినిమాలతో అలరిస్తున్నారు. తాజాగా కండలు తిరిగిన బాడీతో అభిమానులకు సర్ ప్రైజ్ ఇస్తూ ఓ ఫోటో షేర్ చేశారు. తమ హీరో న్యూలుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఆ హీరో ఎవరంటే..

Tollywood : కండలు తిరిగిన బాడీతో.. అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చిన పాన్ ఇండియా స్టార్.. ఎవరంటే..
Jrntr

Updated on: Apr 13, 2026 | 9:41 AM

పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోను గుర్తుపట్టారా.. ? ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న టాలీవుడ్ స్టార్ అతడు. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. మాస్ యాక్షన్ అయిన.. కామెడీ, లవ్ స్టోరీ చిత్రాలైన తన నటనతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఆయన మరోవరె కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇటీవలే దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఈ దుర్మార్గుడే సర్.. ఆ నటుడిపై చిరంజీవికి కంప్లైంట్ చేసిన సౌందర్య.. అసలేం జరిగిందంటే..

అయితే కొన్నాళ్లుగా ఎన్టీఆర్ లుక్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. ఈ మూవీ కోసం పూర్తిగా సన్నబడ్డారు. దీంతో ఆయన లుక్స్ పై అనేక రూమర్స్ క్రియేట్ అయ్యాయి. తాజాగా కండలు తిరిగిన బాడీ చూపిస్తూ ఫోటో షేర్ చేసి అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు. ఈ ఫోటో షేర్ చేస్తూ.. ఇది పెంచుకున్నది, కొనుక్కున్నది కాదు అంటూ రాసుకొచ్చారు. కుమార్ మన్నవ అనే కోచ్ శిక్షణలో ఎన్టీఆర్ తన లుక్ మార్చినట్లు తెలుస్తోంది. డ్రాగన్ సినిమా కోసం తారక్ ఈ లుక్ మెయింటైన్ చేస్తున్నట్లు ఈ ఫోటోకు ఆ సినిమాను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Rocket Raghava : జీవితంలో చెరుపుకోలేని తప్పు చేశా.. ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతున్నా.. సారీ అన్నా.. రాకేట్ రాఘవ..

డ్రాగన్ సినిమాలో తారక్ లుక్ అదిరిపోయిందని.. సిక్స్ ప్యాక్ బాడీ చూపిస్తాడేమో అని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలం తర్వాత సరికొత్త లుక్ లో అభిమానులకు ట్రీట్ ఇచ్చారు ఎన్టీఆర్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఖడ్గంలో శ్రీకాంత్ పాత్ర మిస్సైన హీరో ఎవరో తెలుసా.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్..

ఎక్కువ మంది చదివినవి : Cinema : ప్రతీకారంతో రగిలే ప్రేయసి కథ.. ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్.. ఏకంగా 240 దేశాల్లో స్ట్రీమింగ్..

Follow Us