ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది.. ఎన్టీఆర్- అనిల్ రావిపూడి క్రేజీ కాంబో.. నవ్వుల విందుకు రంగం సిద్ధం!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. చిన్న వయసులోనే హీరోగా తెరంగేట్రం చేసి మాస్ యాక్షన్ చిత్రాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ మూవీతోపాటు దేవర చిత్రంతో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు తారక్. ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ మూవీ చేస్తున్నారు.

ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది.. ఎన్టీఆర్- అనిల్ రావిపూడి క్రేజీ కాంబో.. నవ్వుల విందుకు రంగం సిద్ధం!
Ntr, Anil Ravipudi

Updated on: Nov 14, 2026 | 7:00 PM

టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన కాంబినేషన్‌కు తెరలేచింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలిసి ఓ సినిమా చేయబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రాకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌పై సినీ ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అనిల్ రావిపూడితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ ‘నవ్వుల విందు సిద్ధమవుతోంది’ అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఈ సినిమా పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందనే హింట్ ఇచ్చేశారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మించనున్నారు. మరోవైపు అనిల్ రావిపూడి కూడా ఈ కాంబినేషన్‌పై స్పందిస్తూ.. ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉందని తెలిపారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందనే అర్థం వచ్చేలా సరదాగా ‘ROFL-ing’ అంటూ పోస్ట్ చేశారు.

ప్రస్తుతం తారక్ భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఏదనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడితో సినిమా ప్రకటన రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రశాంత్ నీల్ సినిమాతో యాక్షన్ మోడ్‌లో కనిపించనున్న తారక్.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మాత్రం తనలోని కామెడీ టైమింగ్‌ను మరోసారి చూపించే అవకాశం ఉంది. అనిల్ సినిమాల్లో కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు హీరో ఎలివేషన్స్‌కు కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ను ఆయన ఎలా చూపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ఇప్పటికే ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ భారీ పౌరాణిక నేపథ్య చిత్రం తెరకెక్కనుందనే వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులకు సమయం పట్టే అవకాశం ఉండటంతో, ఈలోపు మరో సినిమా చేయాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.అయితే అనిల్ రావిపూడితో సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఇందులో హీరోయిన్ ఎవరు? ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఎన్టీఆర్ ఎనర్జీ, అనిల్ రావిపూడి కామెడీ స్టైల్ కలిస్తే థియేటర్లలో నవ్వుల సందడి ఖాయమనే అభిమానులు అంటున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us