థియేటర్స్ దద్దరిల్లాల్సిందే.. నాని ప్యారడైజ్‌లో స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. మొదటిసారి నాని కోసం

న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ది ప్యారడైజ్. దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాని జోడిగా అందాల భామ కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుంది.

థియేటర్స్ దద్దరిల్లాల్సిందే.. నాని ప్యారడైజ్‌లో స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. మొదటిసారి నాని కోసం
Nani

Updated on: Jul 29, 2026 | 9:12 AM

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ప్యారడైజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. నాని సినిమా కోసం ఆడియన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. నాని సినిమాలకు మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. ఫ్యామిలీ మొత్తం వెళ్లి చూసి ఎంజాయ్ చేసేలా ఉంటాయి. అది ఏ జోనర్ సినిమా అయినా నాని సినిమా అంటే చాలు ఫ్యాన్ థియేటర్స్ కు క్యూ కడతారు. ఇక దసరాలాంటి మాస్ మసాలా సినిమా తర్వాత హాయ్ నాన్నలాంటి ఫ్యామిలీ సినిమాతో కట్టిపడేసాడు. తర్వాత సరిపోదా శనివారం, హిట్ 3 సినిమాలతో హిట్స్ అందుకున్నారు. నాని ఆతర్వాత ఇక ఇప్పుడు ప్యారడైజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శ్రీకాంత్ ఓదెల  దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది ఈ సినిమా. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

ఇదికూడా చదవండి : అమ్మబాబోయ్.. ఇదెక్కడి మార్పు రా మావ..!! ఈ చిన్నది ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్

ఇక ఈ సినిమాలో నాని జోడిగా కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుంది. అయితే కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండింగ్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ తెరపైకి వచ్చింది. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇదికూడా చదవండి :ఆ కళ్లలోనే ఎదో మాయ ఉంది..! ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చాలా మంది పప్పులో కాలేశారు

ఈ మూవీలో గ్లామరస్ స్పెషల్ సాంగ్ ఉంటుందని సమాచారం. ఈ పాట కోసం ముందుగా తమన్నాను అనుకున్నప్పటికీ.. అనుహ్యంగా ఆతర్వాత మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది ఆ ముద్దుగుమ్మే పూజా హెగ్డే. కానీ ఇప్పుడు మరో హీరోయిన్ పేరు వినిపిస్తుంది. ఆమె ఎవరో కాదు కీర్తిసురేష్. ది ప్యారడైజ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు కీర్తిసురేష్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. గతంలో నేను లోకల్, దసరా సినిమాల్లో కీర్తిసురేష్ నానికి జోడీగా నటించింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు ప్యారడైజ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుందని ప్రచారం జరుగుతుంది. ఈవార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

ఇదికూడా చదవండి :ఎప్పుడూ లవ్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ మాత్రమే కాదు..! ఒక్కసారి ఈ పాట విను మావ.. ఒళ్లు పులకరించిపోతుంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Loading...
Unable to load recommendations.
Follow Us