Priya Bhavani Shankar: పెళ్లిపీటలెక్కనున్న ‘ఇరుముడి’ హీరోయిన్.. ప్రీ వెడ్డింగ్ ఫొటోస్ వైరల్.. వరుడు ఎవరంటే?

సినిమా స్టార్స్ ఒక్కొక్కరు పెళ్లిపీటలెక్కుతున్నారు. అనిరుధ్, సాయి ధరమ్ తేజ్, తేజ సజ్జాలు త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగు పెడుతున్నారు. ఇప్పుడు తాజాగా మరొకరు పెళ్లిపీటలెక్కేందుకు రెడీ అయ్యారు. ఆమె మరెవరో కాదు ఇటీవలే ఇరుమడి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రియా భవానీ శంకర్.

Priya Bhavani Shankar: పెళ్లిపీటలెక్కనున్న ఇరుముడి హీరోయిన్.. ప్రీ వెడ్డింగ్ ఫొటోస్ వైరల్.. వరుడు ఎవరంటే?
Irumudi Movie Actress Priya Bhavani Shankar

Updated on: Nov 10, 2026 | 6:32 PM

ఈ ఏడాది తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాల్లో ‘ఇరుముడి’ ఒకటి. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ డివోషినల్ థ్రిల్లర్ లో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించాడు. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించింది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా రూ. 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో రవితేజకు భార్యగా, ఓ పాపకు తల్లిగా అద్భుతంగా నటించింది కోలీవుడ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్. కాగా ఎన్నో ఏళ్లుగా సినిమాలు చేస్తోందీ అందాల తార. తమిళంతో పాటు తెలుగులోనూ హీరోయిన్ గా చేస్తోంది. అయితే ఇరుముడి హిట్ తో ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం ప్రొఫెషనల్ లైఫ్ పరంగా ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉన్న ప్రియా భవానీ శంకర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక శుభవార్త చెప్పింది. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లిపీటలెక్కనుంది. తన ప్రియుడు రాజ్ వెల్ రాజ్ తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనుందని కోలీవుడ్ లో టాక్. ఇప్పటికే వీరి పెళ్లి పనులు కూడా మొదలయ్యాయి. తాజాగా ప్రియా తన ఇన్ స్టా స్టోరీలో ప్రీ వెడ్డింగ్ ఫొటోస్ షేర్ చేయడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఈ ఫొటోల్లో సంప్రదాయ దుస్తులతో పాటు మెడలో మల్లెపూల దండలతో కనిపించారు ప్రియా భవానీ శంకర్- రాజ్. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ప్రియా భవానీ శంకర్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా ప్రియా భవానీ శంకర్- రాజ్ లు దాదాపు 10 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. కాలేజీ రోజుల నుంచే వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా 2022లోనే ఓ గృహాన్ని కూడా కొనుగోలు చేశారని టాక్. ఇప్పుడు పెద్దల ఆశీర్వాదంతో పెళ్లిపీటలెక్కనున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

కాబోయే భర్తతో ప్రియా భవానీ శంకర్..

కాగా తమిళంలో పలు హిట్ సినిమాల్లో నటించింది ప్రియా భవానీ శంకర్. ధనుష్, విశాల్, శింబు, కార్తి తదితర స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది ప్రియ. కమల్ హాసన్ భారతీయుడు 2లోనూ యాక్ట్ చేసింది. ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే.. సంతోష్ శోభన్ తో కలిసి కల్యాణం కమనీయం అనే సినిమాలో నటించింది ప్రియా. అలాగే అక్కినేని నాగ చైతన్యతో కలిసి ధూత వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేసింది. అలాగే గోపీచంద్ భీమా సినిమాలోనూ హీరోయిన్ గా మెప్పించింది. ఇక ఇరుముడి సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us