Pushpa 2 The Rule: పుష్ప 2 నుంచి మరో టీజర్..! ఈసారి మరింత కిక్ ఇచ్చేలా..

|

Apr 18, 2024 | 9:20 AM

పుష్ప 2 సినిమా టీజర్‌ ఇప్పటికే రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయితే ఈ టీజర్‌ పై కొంతమంది అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. టీజర్ లో కేవలం జాతర మాత్రమే చూపించారు. అలాగే అల్లు అర్జున్ లుక్ కూడా అంతకు ముందు రిలీజ్ చేశారు.. ఇప్పుడు ఈ టీజర్ లోనూ అదే లుక్ లో కనిపించారు బన్నీ. అలాగే ఆయన డైలాగ్ కూడా లేదు. దాంతో ఇప్పుడు పుష్ప 2 నుంచి మరో టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

Pushpa 2 The Rule: పుష్ప 2 నుంచి మరో టీజర్..! ఈసారి మరింత కిక్ ఇచ్చేలా..
Pushpa 2
Follow us on

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో పుష్ప 2 సినిమా ఒకటి.  పుష్ప 2 సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చింది. పుష్ప 2 సినిమా టీజర్‌ ఇప్పటికే రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయితే ఈ టీజర్‌ పై కొంతమంది అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. టీజర్ లో కేవలం జాతర మాత్రమే చూపించారు. అలాగే అల్లు అర్జున్ లుక్ కూడా అంతకు ముందు రిలీజ్ చేశారు.. ఇప్పుడు ఈ టీజర్ లోనూ అదే లుక్ లో కనిపించారు బన్నీ. అలాగే ఆయన డైలాగ్ కూడా లేదు. దాంతో ఇప్పుడు పుష్ప 2 నుంచి మరో టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు సుకుమార్ కొత్త టీజర్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఆ సందర్భంగా పుష్ప 2′ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే టీజర్  పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇది సుకుమార్ దృష్టికి కూడా వెళ్లిందని తెలుస్తోంది. అభిమానుల రిక్వెస్ట్ మేరకు సుకుమార్ త్వరలో ‘పుష్ప 2’ కొత్త టీజర్‌ను విడుదల చేస్తాడని అంటున్నారు. మే నెలాఖరుకు ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు సినిమా ప్రమోషన్ వర్క్ కూడా స్టార్ట్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసింది.

మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పుష్ప2 భారీ విజయం సాధిస్తుందని సినీ అభిమానులు భావిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌తో పాటు రష్మిక మందన్న, డాలీ ధనంజయ్ఎం ఫహద్ ఫాజిల్ తదితరులు నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ‘పుష్ప’ సినిమాలోని పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. దీంతో ‘పుష్ప 2’ పాటలపై కూడా అంచనాలు పెరిగాయి. ‘పుష్ప 2’ సినిమా విడుదలకు ముందే వెయ్యి కోట్ల రూపాయల బిజినెస్ చేసినట్టు సమాచారం. ఈ సినిమా ఓటీటీ రైట్స్, టీవీ రైట్స్, థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయి. నార్త్ ఇండియాలోనూ ఈ చిత్రానికి డిమాండ్ పెరిగింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.