Tuck Jagadish Motion Poster: ‘టక్ జగదీష్’ లుక్ అదుర్స్.. టీజర్ డేట్ ఎప్పుడంటే..

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని అభిమానులకు సడెన్ సర్‏ఫ్రైజ్ ఇచ్చేశాడు. శుక్రవారం డబుల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు ట్వీట్ చేసిన నాని.. వాటిని

Tuck Jagadish Motion Poster: టక్ జగదీష్ లుక్  అదుర్స్.. టీజర్ డేట్ ఎప్పుడంటే..

Updated on: Feb 20, 2021 | 7:27 PM

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని అభిమానులకు సడెన్ సర్‏ఫ్రైజ్ ఇచ్చేశాడు. శుక్రవారం డబుల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు ట్వీట్ చేసిన నాని.. వాటిని ఎప్పుడు విడుదల చేయబోతున్న విషయాన్ని మాత్రం తెలియజేయలేదు. అయితే శనివారం నాని టక్ జగదీష్ మూవీ మోషన్ పోస్టర్ విడుదల చేసి అభిమానులకు షాక్ ఇచ్చాడు.

ప్రస్తుతం నాని.. శివ నిర్వాణ కాంబినేషన్‏లో తెరకెక్కుతున్న సినిమా ‘టక్ జగదీష్’. ఈ సినిమాలో పెళ్ళి కూతురు ఫేం రీతువర్మ హీరోయిన్‏గా నటిస్తోంది. తాజాగా టక్ జగదీష్ మోషన్ పోస్టర్ విడుదల చేస్తూ.. టీజర్ ను  ఈ నెల 23న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్.  ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.  కమర్షియల్ ఎలిమెంట్స్‏తో కూడిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్‏గా ఈ సినిమా రాబోతుంది. నాని కెరీర్‎లో 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో జగపతి బాబు, రావు రమేష్, నాజర్, ప్రవీణ్, ఐశ్వర్య రాజేష్, రోహిని తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్‏తో ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Also Read:

Buchi Babu Sana : మహేష్ సినిమాకు క్లాప్ కొట్టిన ఉప్పెన దర్శకుడు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో…

 

Loading...
Unable to load recommendations.
Follow Us