Nani : ఫోన్ చూడాలన్నా భయమేస్తోంది.. మహిళలపై జరుగుతోన్న లైంగిక వేధింపుల పై నాని కామెంట్స్

|

Aug 27, 2024 | 2:39 PM

తాము ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి పలువురు హీరోయిన్స్ చెప్పుకొచ్చారు.  సింగర్ చిన్మయిలాంటి వారు కాస్టింగ్ కౌచ్ పై కాస్త గట్టిగానే పోరాటం చేస్తున్నారు. తాజాగా మలయాళ ఇండస్ట్రీలో మహిళల పై జరుగుతోన్న లైంగిక వేధింపుల గురించి జస్టిస్‌ హేమ కమిటీ ఓ నివేదికను రెడీ చేసింది.

Nani : ఫోన్ చూడాలన్నా భయమేస్తోంది.. మహిళలపై జరుగుతోన్న లైంగిక వేధింపుల పై నాని కామెంట్స్
Nani
Follow us on

సినిమా ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న వేధింపుల గురించి నిత్యం ఎదో ఒక వార్త వస్తూనే ఉంది. కాస్టింగ్ కౌచ్ వివాదం పై ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ దైర్యంగా మీడియా ముందు మాట్లాడారు. తాము ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి పలువురు హీరోయిన్స్ చెప్పుకొచ్చారు. సింగర్ చిన్మయిలాంటి వారు కాస్టింగ్ కౌచ్ పై కాస్త గట్టిగానే పోరాటం చేస్తున్నారు. తాజాగా మలయాళ ఇండస్ట్రీలో మహిళల పై జరుగుతోన్న లైంగిక వేధింపుల గురించి జస్టిస్‌ హేమ కమిటీ ఓ నివేదికను రెడీ చేసింది. ఆ నివేదికలో దిగ్బ్రాంతికి గురి చేసే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాంతో ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన దీని గురించే చర్చ జరుగుతోంది. దీని పై నేచురల్ స్టార్ నాని స్పందించారు. నాని మాట్లాడుతూ మనం చాలా భయంకరమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం అని అన్నారు.

ఇది కూడా చదవండి : రవితేజ పక్కన లవర్‌గా, వదిన నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

కోల్‌కతాలో జరిగిన సంఘటన తనను ఎంతగానో కలిచివేసిందని అన్నారు నాని. ఈ విషయం గురించి నాని మాట్లాడుతూ.. తన సినిమా సెట్ లో కానీ.. తన చుట్టుపక్కలగాని ఇలాంటి సంఘటనలు జరగలేదు అని అన్నారు. అలాగే “హేమ కమిటీ తయారు చేసిన రిపోర్ట్  చూసి షాకయ్యాను. ఆడవాళ్లపై జరుగుతున్న లైంగిక వేధింపులు చూస్తుంటే మనం చాలా దారుణమైన పరిస్థితుల్లో బతుకున్నామనిపిస్తోంది అని అన్నారు నాని. కోల్‌కతాలో మెడికల్ స్టూడెంట్ పై జరిగిన సంఘటన నన్ను బాగా కలచివేసింది. గతంలో జరిగిన నిర్భయ ఘటన బాధ నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. నిజం చెప్పాలంటే ఫోన్‌ను స్క్రోల్‌ చేయడానికి కూడా భయపడుతున్నా అంన్నారు నాని.

ఇది కూడా చదవండి : Ram Charan: అమ్మబాబోయ్..! రామ్ చరణ్ సిస్టర్ దుమ్మురేపిందిగా.. ఫోజులు చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే

అలాగే సోషల్ మీడియాను ఎక్కువగా వాడేస్తున్నాం.. మితిమీరిన వాడటం అనేది ఎప్పటికైనా ప్రమాదమే.. దాని వల్ల నష్టం జరుగుతోంది. ఆడవాళ్ళ పై జరుగుతోన్న గురించి విన్నప్పుడల్లా వాటినుంచి నేను త్వరగా బయటకు రాలేకపోతున్నా.. 20 ఏళ్ల క్రితం పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉండేవి. అప్పటి రోజుల్లో ఆడవాళ్లకు రక్షణ ఉండేది. అప్పటితో పోలిస్తే పరిస్థితులు ఇప్పుడు చాలా దారుణంగా మారిపోయాయి అని నాని అన్నారు. నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.