Allu Arjun : అన్నా ఇది నువ్వేనా? ఈ ఫొటోలో ఉన్న టాలీవుడ్ స్టార్‌ను గుర్తు పట్టారా? 20 ఏళ్ల నాటి ఫొటో వైరల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం బన్నీకి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కేవలం సామాన్య జనాలే కాదు తోటి హీరోలు, దర్శక నిర్మాతలు, ఇతర టెక్నీ షియన్లు కూడా అల్లు అర్జున్ ను అభిమానిస్తారు.

Allu Arjun : అన్నా ఇది నువ్వేనా? ఈ ఫొటోలో ఉన్న టాలీవుడ్ స్టార్‌ను గుర్తు పట్టారా? 20 ఏళ్ల నాటి ఫొటో వైరల్
Allu Arjun

Updated on: Sep 13, 2026 | 8:00 PM

ఐకాన్ స్టార్ అల్లు కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రేజ్ కలిగిన పాన్ ఇండియా హీరోల్లో ఆయన కూడా ఒకరు. అల్లు అరవింద్ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా తన ట్యాలెంట్ తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు బన్నీ. బాలనటుడిగా సినీ రంగంలో అడుగు పెట్టటిన ఈయన గంగోత్రి సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత నుంచి వరుస హిట్స్ అందుకుంటూ తన క్రేజ్ ను మరింతగా పెంచుకున్నాడు. ఇప్పుడు బన్నీకి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కేవలం సామాన్య జనాలే కాదు హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు, ఇతర టెక్నీ షియన్లు కూడా అల్లు అర్జున్ ను అభిమానిస్తారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో దేశ ముదురు ఒకటి. 2007లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పూరీ జగన్నాధ్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో బన్నీ తన దైన నటనతో అదరగొట్టాడు. ముఖ్యంగా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక ఈ సినిమాలో బన్నీ హెయిర్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలో దేశముదురు సినిమా లుక్ లో టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ డైరెక్టర్ కనిపించారు. అచ్చం అల్లు అర్జున్ లాగే తయారై సర్ ప్రైజ్ ఇచ్చారు. పై ఫొటో అదే. ఇది పాత ఫొటోనే అయినా ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మరి అందులో ఉన్నదెవరో గుర్తు పట్టారా?

 

ఇవి కూడా చదవండి

దేశ ముదురు సినిమా విడుదల అయ్యాక తర్వాత చాలా మంది కుర్రకారు అల్లు అర్జున్ స్టైల్ ను ఫాలో అయ్యారు. అలా 20 ఏళ్ల వయసులోనే బన్నీని అనుకరించిన ఆ డైరెక్టర్ మరెవరో కాదు ‘హిట్’ సిరీస్ సినిమాలతో పాపులర్ అయిన శైలేష్ కొలను. దేశముదురు సినిమా రిలీజ్ టైమ్ లో శైలేష్ వయసు 20 ఏళ్లు. ఆ సమయంలోనే అచ్చం అల్లు అర్జున్ ధరించిన డెనిమ్ జాకెట్ సహా.. జీన్స్ వేసుకుని.. మెడలో ఉన్న స్టైలిష్ లాకెట్ ను నోట్లో పెట్టుకుని పోజులిచ్చాడు శైలేష్.

కాగా హిట్ సిరీస్ లో ఇప్పటివరకు మూడు సినిమాలు తెరకెక్కించాడు శైలేష్. అన్నీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ముఖ్యంగా హిట్ 3 సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం ఈ హిట్ సిరీస్ లోనే నాలుగో భాగాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడీ స్టార్ డైరెక్టర్. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ఇందులో మెయిన్ లీడ్ రోల్ చేయనున్నాడు.

డైరెక్టర్ శైలేష్ కొలను..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us