
1999లో విడుదలైన సూరజ్ బర్జాత్య సూపర్‌హిట్ చిత్రం ‘హమ్ సాథ్ సాథ్ హై’. ఈ మూవీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు. అలాగే ఓ ఛైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఓ కీలక పాత్రలో మెరిసింది. తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర మేసుకుంది.ఇప్పుడు ఆ చిన్న అమ్మాయి స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. తన అందం, అభినయంతో కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది. ఇంతకీ ఆమె ఎవనుకుంటున్నారా? జోయా అఫ్రోజ్. తెలుగు ఆడియెన్స్ కు పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ.. హిందీ ప్రేక్షకులకు ఈ బ్యూటీ బాగా సుపరిచితమే. చాలా చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగు పెట్టింది జోయా అఫ్రోజ్. 1998లో వచ్చిన ‘కోరా కాగజ్’ అనే టీవీ సిరీస్‌లో మొదటి సారి కనిపించింది. ఆ తర్వాత ‘హమ్ సాథ్ సాథ్ హై’ చిత్రంలో తన అమాయక నటనతో అందరి హృదయాలను గెలుచుకుంది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో ఈ క్యూటీ పేరు తెగ మార్మోగిపోయింది. ఇప్పుడు అదే జోయా తన అందం, అభియనంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘తస్కరి’ OTT ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ సిరీస్ కారణంగానే ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది. జనవరి 2026లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన క్రైమ్ డ్రామాలో జోయా నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి.
జోయా అఫ్రోజ్ జనవరి 10, 1994న ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జన్మించింది. ఫిబ్రవరి 2026 నాటికి, జోయా వయస్సు 32 సంవత్సరాలు. ముంబైలో పెరిగిన జోయా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందు మోడలింగ్‌లోనూ మెరుపులు మెరిపింది. 2013లో, ఆమె ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొంది. అందాల కిరీటం గెలవకపోయినా, మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2021 టైటిల్‌ను గెలుచుకుంది. అలాగే జపాన్‌లో జరిగిన మిస్ ఇంటర్నేషనల్ 2022 పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఇక నటిగా పలు పంజాబీ, హిందీ సినిమాల్లో మెరిసిందీ అందాల తార. ది ఎక్స్ పోజ్, స్వీటీ వెడ్స్ ఎన్ఆర్ ఐ, సికందర్ కా ముఖద్దర్ వంటి సినిమాలతో పాటు ముక్బిర్, ఫైర్ ఫ్లైస్ వంటి వెబ్ సిరీసుల్లోనూ మెరిసింది.
ఇక సోషల్ మీడియాలోనూ జోయాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టా గ్రామ్ లో ఆమె ఫొటోలు, వీడియోలకు నెటిజన్లు నుంచి మంచి స్పందన వస్తుంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.