Jabardasth: ఈ అక్కాచెల్లెళ్లు ఇప్పుడు బాగా ఫేమస్.. ఎవరో గుర్తు పట్టారా? ఒకరు జబర్దస్త్‌లో స్టార్ కమెడియన్

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న లేడీ కమెడియన్లలో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు. ప్రస్తుతం టీవీ షోలతో పాటు సినిమాలతో బిజీగా ఉంటోన్న ఈ అందాల తార బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోనూ పార్టిసిపేట్ చేస్తుందని ప్రచారం జరుగుతోంది.

Jabardasth: ఈ అక్కాచెల్లెళ్లు ఇప్పుడు బాగా ఫేమస్.. ఎవరో గుర్తు పట్టారా? ఒకరు జబర్దస్త్‌లో స్టార్ కమెడియన్
Jabardasth Actress

Updated on: Jul 29, 2026 | 9:10 PM

పై ఫొటోలో ఉన్న అక్కాచెల్లెళ్లను గమనించారా? అందులో ఒకామె ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్. లేడీ కమెడియన్ గా ప్రస్తుతం బిజీ బిజీగా ఉంటోంది. అంతకు ముందు జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోల్లోనూ మెరిసిందీ అందాల తార. తన యాక్టింగ్ తో తెలుగు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అన్నట్లు ఈ నటి తల్లి కూడా టాలీవుడ్ లో బాగా ఫేమస్. గతంలో పెదరాయుడు వంటి సినిమాల్లోనూ నటించింది. ఇక ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇటీవల బాగా వార్తల్లో నిలిచారు. అదేంటంటే.. ఇందులో ఒకామె ఇటీవల విజయవంతమైన విక్రమ్-1 రాకెట్ ప్రయోగంలో పాలు పంచుకుంది. దీంతో ఈ ఇద్దరి అక్కాచెల్లెళ్ల పేర్లు ఇప్పుడు మార్మోగుతున్నాయి. అలా పై ఫొటోలో ఉన్న అక్కాచెల్లెళ్లలో ఒకరు జబర్దస్త్ టాప్ కమెడియన్ కాగా మరొకరు ఏవియానిక్స్ ఇంజనీర్. మరి వారెవరో గుర్తు పట్టారా? పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు జబర్దస్త్ ఫేమ్ సత్యశ్రీ, ఆమె సోదరి కీర్తి శ్రీ.

జబర్దస్త్ సత్యశ్రీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ లోకి రాక ముందు పలు షార్ట్ ఫిల్మ్స్ చేసిందామె. ఆ క్రేజ్ తోనే జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది. చమ్మక్ చంద్ర టీంలో చాలా ఏళ్ల పాటు పని చేసింది. అయితే చమ్మక్‌ చంద్రకి సినిమా ఆఫర్లు రావడంతో జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేశారు. ఆయనతో పాటే సత్యశ్రీ కూడా ఈ షో నుంచి బయటకు వెళ్లిపోయింది. ఇప్పుడు సినిమాల్లో సహాయక నటిగా, కమెడియన్ గా చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది సత్య శ్రీ. జబర్దస్త్ ను విడచి పెట్టిన తర్వాత ‘రాజా ది గ్రేట్‌’, ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’, ‘సిల్లీ ఫెలోస్‌’, ‘ఎఫ్ 3’, ‘రారండోయ్‌ వేడుక చేద్దాం’, ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్, ‘అనగనగా ఒక రాజు’ వంటి సినిమాల్లో వివిధ పాత్రలు పోషించింది సత్యశ్రీ.

ఇవి కూడా చదవండి

 

చెల్లెలు కీర్తిశ్రీ తో జబర్దస్త్ సత్యశ్రీ

ఇక సత్యశ్రీ సోదరి కీర్తి శ్రీ విషయానికి వస్తే.. ఈమె ఒక ఏవియానిక్స్ ఇంజనీర్. ఇటీవల విజయవంతమైన విక్రమ్-1 రాకెట్ ప్రయోగంలో ఆమె ఏవియానిక్స్ ఇంజనీర్‌గా, ఎలక్ట్రికల్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్ట్ ఇంజనీర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించింది. ఈ క్రమంలో తన సోదరి గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యింది సత్యశ్రీ. ‘మిషన్ ఆగమన్’ రాకెట్‌పై నా చెల్లి సంతకం చేస్తుంటే ఒక అక్కగా నాకు ఎంతో గర్వంగా ఉంది. చిన్నప్పుడు నక్షత్రాలని వింతగా చూసిన నా చిన్నారి యువరాణి.. ఈ రోజు ఆ నక్షత్రాల వైపు ప్రయాణించే రాకెట్‌ని నిర్మించే స్థాయికి ఎదగడం వెనుక ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ ఉంది’ అని సత్యశ్రీ తన ఆనందానికి అక్షర రూపమిచ్చింది.

విక్రమ్- రాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్య శ్రీ చెల్లెలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us