Tollywood: ఏం మేకోవర్ రా బాబు.. పద్దతిగా ఉందనుకుంటే.. గ్లామర్ డోస్‏తో సెగలు పుట్టిస్తోందిగా..

|

Jun 25, 2024 | 11:50 AM

ముఖానికి మేకప్ లేదు.. చాలా చిన్న వయసులో కనిపిస్తున్న అమ్మాయి. మైక్ ముందు ఎంతో పద్దతిగా మాట్లాడుతూ శ్రోతల మనసులు గెలుచుకుంది. నటిగా స్టార్ డమ్ అందుకోవడమే కాదు.. గాయనిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. సినీరంగంలో ఈ అమ్మాయి మల్టీటాలెంటెడ్. ఆమె తండ్రి అగ్ర కథానాయకుడు.

Tollywood: ఏం మేకోవర్ రా బాబు.. పద్దతిగా ఉందనుకుంటే..  గ్లామర్ డోస్‏తో సెగలు పుట్టిస్తోందిగా..
Actress 1
Follow us on

సినీ పరిశ్రమలో కథానాయికగా స్టార్ డమ్ అందుకోవాలంటే టాలెంట్ మాత్రమే కాదు అందం కూడా ముఖ్యమే. ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ అందంగా కనిపించేందుకు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారు. ఈ విషయాన్ని ఇప్పటికే చాలా మంది హీరోయిన్ కూడా ఒప్పుకున్నారు. అందులో ఈ అమ్మాయి కూడా ఒకరు. పైన ఫోటోను చూశారా..? ముఖానికి మేకప్ లేదు.. చాలా చిన్న వయసులో కనిపిస్తున్న అమ్మాయి. మైక్ ముందు ఎంతో పద్దతిగా మాట్లాడుతూ శ్రోతల మనసులు గెలుచుకుంది. నటిగా స్టార్ డమ్ అందుకోవడమే కాదు.. గాయనిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. సినీరంగంలో ఈ అమ్మాయి మల్టీటాలెంటెడ్. ఆమె తండ్రి అగ్ర కథానాయకుడు. కానీ తండ్రి పేరును ఏమాత్రం ఉపయోగించుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో అవమానాలు, విమర్శలు ఎదుర్కొని ఇప్పుడు టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతుంది. కోట్లాది మంది ప్రేక్షకుల ఆరాధ్య దేవత. హీరోయిన్ కాకముందు సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రముఖ సింగర్ ఆశా భోంస్లే ముందు స్కూల్ యూనిఫాంలో కూర్చొని పాటలు పాడింది. అప్పుడు ఆమె వయసు కేవలం ఆరేళ్లు మాత్రమే. ఇంతకీ ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ శ్రుతి హాసన్.

విశ్వ నాయకుడు కమల్ హాసన్ కూతురిగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఇప్పుడు టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. అనగనగా ఓ ధీరుడు సినిమాతో కథానాయికగా పరిచయమైంది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో శ్రుతిహాసన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. హీరోయిన్ కాకముందు తైవర్ మకాన్ చిత్రంలో ఓ సాంగ్ పాడింది. చెన్నైలో పాఠశాల విద్యను అభ్యసించిన శ్రుతిహాసన్.. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం ముంబైకి వెళ్లింది. ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ లో సంగీతం నేర్చుకుంది.

తన తండ్రి కమల్ హాసన్ నటించిన హే రామ్ సినిమాలో శ్రుతి హాసన్ బాలనటిగా కనిపించింది. ఆ తర్వాత హిందీలో లక్ సినిమాతో హీరోయిన్ పరిచయమైంది. తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది శ్రుతిహాసన్. ఈ మూవీ తర్వాత వెనుదిరిగి చూడలేదు. బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోయింది. ప్రస్తుతం సలార్ 2 సినిమా కోసం రెడీ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.