Tollywood: సీనియర్ హీరోయిన్ శారద పక్కన కుర్చున్న ఆ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు పాన్ ఇండియా స్టార్..

|

Jun 23, 2024 | 8:38 AM

తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టమైన నటీమణులలో శారద ఒకరు. ఒకప్పుడు అనేక చిత్రాల్లో తనదైన నటనతో అనేక పాత్రలకు జీవం పోశారు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్ భాషలలో పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. లేడీ ఓరియెంటెడ్ కథలలో అలరించారు. అటు నటిగా వెండితెరపై సందడి చేసి ఇటు రాజకీయాల్లోనూ ప్రజాసేవ చేశారు. ఇప్పుడు సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.

Tollywood: సీనియర్ హీరోయిన్ శారద పక్కన కుర్చున్న ఆ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు పాన్ ఇండియా స్టార్..
Actor 2
Follow us on

ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని త్రోబ్యాక్ వీడియోస్, ఫోటోస్ మరోసారి నెటిజన్స్ ముందుకు వస్తున్నాయి. ఒకప్పటి స్టార్ నటీనటులకు సంబంధించిన రేర్ వీడియోస్ ఇప్పుడు మళ్లీ చూసే ఛాన్స్ వచ్చింది. అలాగే ప్రస్తుతం వెండితెరపై అగ్రకథానాయకులుగా కొనసాగుతున్న తారల చిన్ననాటి ఫోటోస్, వీడియోస్ సైతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ త్రోబ్యాక్ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. అందులో సీనియర్ హీరోయిన్ శారద.. ఆ పక్కనే మరో స్టార్ హీరో కనిపిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టమైన నటీమణులలో శారద ఒకరు. ఒకప్పుడు అనేక చిత్రాల్లో తనదైన నటనతో అనేక పాత్రలకు జీవం పోశారు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్ భాషలలో పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. లేడీ ఓరియెంటెడ్ కథలలో అలరించారు. అటు నటిగా వెండితెరపై సందడి చేసి ఇటు రాజకీయాల్లోనూ ప్రజాసేవ చేశారు. ఇప్పుడు సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఇప్పుడు నెట్టింట శారదకు సంబంధించిన ఓ త్రోబ్యాక్ వీడియో వైరలవుతుంది.

ఆ వీడియో చూస్తుంటే ఏదో అవార్డ్స్ ఈవెంట్ లా కనిపిస్తుంది. అందులో సీనియర్ హీరోయిన్ పక్కనే ఓ కుర్రాడు బ్లాక్ టీషర్ట్ వేసుకుని కూర్చున్నాడు. ఆ చిన్నోడు ఇప్పుడు కోట్లాది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న హీరో. చిన్న వయసులోనే బాలనటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి నటన అద్భుతం. మనసు వెన్న. నూనుగు మీసాలు కూడా రాని వయసులోనే బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టాడు. అతడి సినిమాలు విడుదలయ్యాయంటే థియేటర్లలో ఓ ప్రభంజనం సృష్టించే ఫ్యాన్స్ ఉన్నారు. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి వచ్చినా నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. మాస్ యాక్షన్ అయినా.. మదిని మెప్పించే లవ్ స్టోరీ అయినా.. కడుపుబ్బా నవ్వించే కామెడీ అయినా ఎలాంటి పాత్ర అయిన ఆతడి నటనకు ముగ్దులవ్వాల్సిందే. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో తెలుసా..? అతడు మరెవరో కాదండి.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.

ఆ వీడియోలో సీనియర్ హీరోయిన్ శారద పక్కన కూర్చుని ఉన్నాడు. ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర, రామాయణం చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించాడు. 18 ఏళ్ల వయసులోనే నిన్ను చూడాలని సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక వివి వినాయక్ తెరకెక్కించిన ఆది సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అతి తక్కువ సమయంలో స్టా్ర్ డమ్ అందుకున్నాడు. రాఖీ, యమదొంగ, అరవింద సమేత, జనతా గ్యారేజ్ సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న తారక్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.