Gladdiator 2: గ్లాడియేటర్ 2 వచ్చేస్తోంది.. 24 ఏళ్ల తర్వాత సీక్వెల్.. ట్రైలర్ చూశారా..?

|

Jul 10, 2024 | 1:43 PM

ఈ సినిమాకు డైరెక్టర్ రిడ్లీ స్కాట్ దర్శకత్వం వహించారు. ఇందులో పాల్ మాస్కల్ హీరోగా నటించగా.. పెడ్రో పాస్కల్, కొన్ని నీల్సన్, డెంజల్ వాషింగ్టన్, మేక్లామ్ వే కీలకపాత్రలు పోషించారు. ఇక ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ రాబోతుంది. గ్లాడియేటర్ 2 చిత్రాన్ని త్వరలోనే అడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు

Gladdiator 2: గ్లాడియేటర్ 2 వచ్చేస్తోంది.. 24 ఏళ్ల తర్వాత సీక్వెల్.. ట్రైలర్ చూశారా..?
Gladiator 2 Movie Trailer
Follow us on

గ్లాడియేటర్.. దాదాపు 24 ఏళ్ల క్రితం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిచన సినిమా. ఈ హాలీవుడ్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ అప్పట్లో భారీ వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ సునామీ సృష్టించిన ఈ సినిమా ఏకంగా 5 విభాగాల్లో ఆస్కార్ అవార్డులు దక్కించుకుంది. ఈ సినిమాకు డైరెక్టర్ రిడ్లీ స్కాట్ దర్శకత్వం వహించారు. ఇందులో పాల్ మాస్కల్ హీరోగా నటించగా.. పెడ్రో పాస్కల్, కొన్ని నీల్సన్, డెంజల్ వాషింగ్టన్, మేక్లామ్ వే కీలకపాత్రలు పోషించారు. ఇక ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ రాబోతుంది. గ్లాడియేటర్ 2 చిత్రాన్ని త్వరలోనే అడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు.

తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. అలాగే విడుదల తేదీని కూడా అనౌన్స్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే పార్ట్ కు సంబంధం లేని స్టోరీని రెడీ చేసినట్లు తెలుస్తోంది. పురాతన రోమ్ అందాలు, యుద్ధాలు, మైండ్ బ్లోయింగ్ విజువల్స్ మరోసారి గ్లాడియేటర్ 2 సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఈ ఏడాది నవంబర్ 22న తెలుగుతోపాటు, కన్నడ, మలయాళం, తమిళం లాంటి ఇతర ప్రాంతీయ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది.

ట్రయిలర్ మాజీ రోమన్ చక్రవర్తి మార్కస్ ఆరేలియస్ (జోక్విన్ ఫీనిక్స్ పోషించిన) మనవడు లూసియస్ (మెస్కల్)తో ప్రారంభమవుతుంది. ఒరిజినల్ గ్లాడియేటర్ లో చిన్న పిల్లాడిగా కనిపించిన లూసియస్… మార్కస్ చక్రవర్తిపై ప్రతీకారం తీర్చుకోవడం చూడొచత్చు.ఇందులో లూసియస్ ఉత్తర ఆఫ్రికా ప్రాంతమైన నుమిడియాలో నివసిస్తున్నట్లు కనిపిస్తుంది. అతడిని రోమన్ సామ్రాజ్యానికి దూరంగా ఉంచేందుకు అతడి తల్లి లూసియస్ ను అక్కడకు పంపిస్తుంది. కానీ పరిస్థితులు అతడిని తిరిగి రోమ్ కు తీసుకువస్తాయి. ఆ తర్వాత లూసియస్ పోరాటం గురించి ఈ మూవీలో చూపించనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.