“మిహీకాను వివాహ‌మాడ‌టం..నా లైఫ్ లో బెస్ట్ మూమెంట్ అవుతుంది”

|

Jul 28, 2020 | 3:45 PM

కరోనా సమయంలోనూ టాలీవుడ్‌లో వరుస పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఇప్పటికే దిల్ రాజు, నిఖిల్‌లు వివాహం చేసుకోగా.. ఈ ఆదివారం నితిన్‌ కూడా షాలిని మెడ‌లో మూడు ముళ్లు వేశాడు.

మిహీకాను వివాహ‌మాడ‌టం..నా లైఫ్ లో బెస్ట్ మూమెంట్ అవుతుంది
Follow us on

Rana Daggubati and Miheeka Bajaj : కరోనా సమయంలోనూ టాలీవుడ్‌లో వరుస పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఇప్పటికే దిల్ రాజు, నిఖిల్‌లు వివాహం చేసుకోగా.. ఈ ఆదివారం నితిన్‌ కూడా షాలిని మెడ‌లో మూడు ముళ్లు వేశాడు. ఇక వచ్చే నెలలో దగ్గుబాటి వారసుడు రానా పెళ్లికి సిద్దమయ్యారు. అయితే పెళ్లి తేదీ విష‌యంలో ర‌క‌రకాలు రూమర్స్ వ‌స్తోన్న నేప‌థ్యంలో క్లారిటీ ఇచ్చాడు ఈ ద‌గ్గుబాటి హీరో. ఆగ‌స్టు 8న మిహీక మెడ‌లో మూడు ముళ్లు వేయ‌బోతున్న‌ట్లు తెలిపాడు. వివాహం చేసుకోవడానికి ఇది సరైన సమయం అని చెప్పిన‌ 35 ఏళ్ల రానా.. తన కాబోయే భార్య తన నివాసం నుండి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్నట్లు పేర్కొన్నాడు. మిహీకాను వివాహం చేసుకోవడం త‌న జీవితంలో బెస్ట్ మూమెంట్ అవుతుంద‌ని చెప్పుకొచ్చాడు.

మే మూడవ వారంలో సాంప్రదాయ రోకా వేడుకతో రానా-మిహీకాల‌ వివాహ వేడుక‌లు ప్రారంభమ‌య్యాయి. జూన్లో లగ్న పత్రికలు అంద‌జేసే కార్యక్ర‌మంలో భాగంగా వరుడి కుటుంబం వధువు ఇంటికి వెళ్లి వెడ్డింగ్ కార్డు అంద‌జేసింది.

 

Read More : ఏపీ రైతుల‌కు గుడ్ న్యూస్.. ఆర్‌బీకేల్లో మార్కెటింగ్ సేవ‌లు