Prabhas’s Radhe Shyam: ప్రభాస్ ఫ్యాన్స్‌కు కొత్త టెన్షన్.. ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమో అని భయం

|

Jan 22, 2021 | 9:53 AM

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇప్పుడు పెద్ద టెన్షన్ పట్టుకుంది. సినిమా రిజల్ట్ విషయంలో వారు ఇప్పుడు తెగ కంగారుపడిపోతున్నారు. ఇంకా టీజర్‌ కూడా రాకుండానే ఇంత వర్రీ ఎందుకు అనుకుంటున్నారా..?...

Prabhass Radhe Shyam: ప్రభాస్ ఫ్యాన్స్‌కు కొత్త టెన్షన్.. ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమో అని భయం
Follow us on

Prabhas’s Radhe Shyam:  ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇప్పుడు పెద్ద టెన్షన్ పట్టుకుంది. సినిమా రిజల్ట్ విషయంలో వారు ఇప్పుడు తెగ కంగారుపడిపోతున్నారు. ఇంకా టీజర్‌ కూడా రాకుండానే ఇంత వర్రీ ఎందుకు అనుకుంటున్నారా..? దానికి… ఓ సాలిడ్ రీజన్ ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు రెబల్ స్టార్ కృష్ణంరాజు. ఆ అప్‌డేట్ తెలిసిన దగ్గర నుంచే ప్రభాస్‌ అభిమానుల్లో కంగారు మొదలైంది.  ‘రాధేశ్యామ్’ సినిమాలో తాను కూడా ఓ కీరోల్‌ చేస్తున్నా అంటూ తన పుట్టిన రోజున ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు నటుడు కృష్ణంరాజు. అయితే గతంలో ప్రభాస్‌, కృష్ణంరాజు కలిసి నటించిన సినిమాలు ఆడియన్స్‌ను పెద్దగా అలరించలేకపోయాయి. బిల్లా, రెబల్ సినిమాల్లో కలిసి నటించారు ఈ ఇద్దరు రెబల్ స్టార్స్‌. కానీ ఆ రెండు సినిమాల రిజల్ట్స్ అనుకున్నంత స్థాయిలో మాత్రం లేవు.

‘రాధేశ్యామ్’ విషయంలోనూ అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందా అన్న టెన్షన్‌లో ఉన్నారు డార్లింగ్ ఫ్యాన్స్‌. వరుసగా యాక్షన్‌ సినిమాల తరువాత ఓ క్లాస్‌ లవ్‌ స్టోరి చేస్తుండటంతో ఆడియన్స్‌ ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అన్న టెన్షన్‌ ఇప్పటికే ఫ్యాన్స్‌లో ఉంది. దీనికి ఇప్పుడు ఈ బ్యాడ్‌ సెంటిమెంట్ కూడా తోడవ్వటంతో మరింత టెన్షన్‌ పడుతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్‌. మరి ఈ సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేసి డార్లింగ్ హిట్ కొడతారేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Anil Ravipudi : గాలి సంపత్ ను గాడిలో పెట్టే పనిలో టాప్ డైరెక్టర్.. అనీల్ రావిపూడి పర్యవేక్షణలో షూటింగ్..

’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ మూవీ ట్రైలర్ రిలీజ్.. ప్రేమ, హాస్యంతో ఆసక్తికరంగా ప్రదీప్ సినిమా..