’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ మూవీ ట్రైలర్ రిలీజ్.. ప్రేమ, హాస్యంతో ఆసక్తికరంగా ప్రదీప్ సినిమా..

టెలివిజన్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న సినిమా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా'. ఇప్పటికే ఈ సినిమా

'30 రోజుల్లో ప్రేమించడం ఎలా' మూవీ ట్రైలర్ రిలీజ్.. ప్రేమ, హాస్యంతో ఆసక్తికరంగా ప్రదీప్ సినిమా..
Follow us

|

Updated on: Jan 21, 2021 | 8:22 PM

టెలివిజన్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న సినిమా ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన నీలి నీలి ఆకాశం అనే సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిన సంగతే. ఇందులో అమృతఅయ్యార్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. మున్నా కొత్త దర్శకుడుగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాను గీత ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా ప్రభావంతో వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‏ను హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశాడు.

ఈ ట్రైలర్‏లో పునర్జన్మల లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా వస్తున్నట్లుగా తెలిస్తోంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్‏గా రాబోతున్న ఈ సినిమాలో హర్ష చెముడు, భద్రం, హేమ, పోసాని కృష్ణమురళి, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ వీడియోలో ప్రదీప్, హర్ష కమెడి నవ్వులు పూయిస్తోంది. ఇక ఈ సినిమా జనవరి 29న విడుదల కానుంది.

Also Read:

ఆ యంగ్ హీరోయిన్‏ను సెలక్ట్ చేసిన డైరెక్టర్.. వెంటనే నో చెప్పిన గోపీచంద్.. అసలు కారణం ఇదే..

తెలుగులో రీమేక్ కానున్న ‘కొరియన్’ సినిమా.. అధికారికంగా ప్రకటించిన పాపులర్ నిర్మాణ సంస్థ.. త్వరలోనే షూటింగ్..