
రణ వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కిస్తోన్న ‘ధురంధర్ 2’ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ టీజర్ గురించి ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొంది. గత కొన్ని రోజులుగా చాలా మంది దీని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ టీజర్ చూసిన తర్వాత చాలా మంది చాలా నిరాశ చెందారు. దీనికి కారణం ‘ధురంధర్ 2’ టీజర్‌లో చూపించిన సీన్స్. ఇందులో ఉన్న సన్నివేశాలన్నీ ఆల్రెడీ ‘ధురంధర్’ పార్ట్-1 క్లైమాక్స్ తర్వాత చూపించినవే. ఇప్పుడు ‘ధురంధర్ 2’ టీజర్‌లో కూడా అవే సీన్స్ ఉన్నాయి. దీంతో ఫ్యాన్స్ ధురంధర్ మేకర్స్ పై భగ్గుమంటున్నారు. ‘ధురంధర్ 2’ టీజర్ పై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు . ‘ఇందులో కొత్తగా ఏమీ లేదు, మనం ఇవన్నీ చూశాం’ అని ఒకరు రాశారు. ‘మొదటి ఎపిసోడ్ చివరిలో ఇదే టీజర్ చూశాం’ అని మరొకరు అన్నారు. ‘కొత్తగా ఏదైనా చూస్తామని అనుకున్నాను. ఇప్పుడు వెంటనే ట్రైలర్ విడుదల చేయండి’ అని మరొకరు రాశారు.
ధురంధర్ 2 టీజర్ పై ప్రేక్షకుల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ, అందులో రణవీర్ సింగ్ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. రెహ్మాన్ డెకాయిట్ మరణం తరువాత, హంజా ల్యారీని ఎలా ఏలాడో ఇందులో చూపించారు మేకర్స్. ‘యే నయా హిందూస్తాన్ హై, ఘర్ మే ఘుసేగా భీ ఔర్ మారేగా భీ..’ అంటూ ఈ టీజర్ చివరిలో రణవీర్ చెప్పిన డైలాగ్ బాగా హైలెట్ అయ్యింది. ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ హంజా అలీ మజారి పాత్రలో నటించాడు, అతను పాకిస్తాన్‌లోని ల్యారీ నగరంలోని ఒక ఉగ్రవాద సంస్థలోకి చొరబడి గూఢచారిగా మారతాడు. ఈ చిత్రంలో, సంజయ్ దత్ ఎస్పీ చౌదరి అస్లాం పాత్రలో, ఆర్. మాధవన్ అజయ్ సన్యావ్ పాత్రలో, అర్జున్ రాంపాల్ మేజర్ ఇక్బాల్ పాత్రలో, రాకేష్ బేడి జమిల్ జమాలీ పాత్రలో, సారా అర్జున్ యాలినా జమాలీ పాత్రలో నటించారు. డానిష్ పండోర్ ఉజైర్ బలోచ్ పాత్రలో కనిపించాడు. మొదటి భాగంలో అక్షయ్ ఖన్నా పోషించిన రెహ్మాన్ డకైట్ చనిపోతాడు. అయితే ఆ పాత్రకు ఉన్న క్రేజ్ దృష్ట్యా సీక్వెల్ లో రెహ్మాన్ ను మళ్లీ బతికించారని తెలుస్తోంది. సినిమా రిలీజయ్యాక కానీ దీనిపై ఓ క్లారిటీ రాదు.
ఇది కొత్త భారత్.
ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
చంపుతుంది కూడా.Dhurandhar: The Revenge
Teaser Out Now#DhurandharTheRevenge Releasing In Cinemas Worldwide on 19th March 2026 in Hindi, Telugu, Tamil, Kannada & Malayalam@RanveerOfficial #AkshayeKhanna @duttsanjay @ActorMadhavan… pic.twitter.com/wLYJ9xKlSn— Jio Studios (@jiostudios) February 3, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి