కొంతమంది హీరోయిన్ చేసింది కొన్ని సినిమాలే చేసుకున్నప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్ హీరోయిన్ గా రాణిస్తారు అనుకున్న సమయంలో ఊహించని విధంగా సినిమాలకు దూరం అయ్యి ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా ఒకరు. ఒకప్పుడు లవ్ స్టోరీ సినిమాలకు చాల ఫెమస్ ఈ హీరోయిన్. కుర్రాళ్లంతా ఇలాంటి లవర్ మనకు ఉండాలి అని అనుకునే వారు. తెలుగులో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఇంతకు ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? గుర్తుపట్టడం కాస్త కష్టమే కానీ ఆమె గురించి తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరంటే..
పై ఫొటోలో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్ మరెవరో కాదు. రేఖ వేదవ్యాస్. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఆనందం సినిమాలో నటించి మెప్పించింది రేఖ. ఆతర్వాత తారకరత్న నటించిన ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాలో నటించి మెప్పించింది. రేఖ కన్నడ ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేశారు. ఆమె ఎంట్రీ కూడా కన్నడ సినిమాతోనే.. ఆనందం రేఖ మొదటి తెలుగు సినిమా.. తెలుగులో చివరిగా జీనియస్ అనే సినిమాలో నటించారు.
2014 తర్వాత రేఖ సినిమాలకు దూరం అయ్యారు. తాజాగా ఓ ప్రముఖ ఛానెల్ లో షో కు హాజరయ్యారు రేఖ. అయితే ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయి షాక్ ఇచ్చారు. చాలా బక్కగా మారిపోయారు రేఖ. ఇందుకు కారణం ఆమె ఓ వ్యాధి భారిన పడ్డారని.. దానికి చికిత్స చేయించుకుంటున్నారని అందుకే ఇలా మారిపోయారని తెలుస్తోంది. తన పరిస్థితి గురించి చెప్తూ స్టేజ్ పై కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు రేఖ. ఒకప్పుడు తన అందంతో కట్టిపడేసిన రేఖ ఇప్పుడు ఇలా మారిపోయాడంతో ప్రేక్షకులు షాక్ కు గురవుతున్నారు. ఆమె ఆరోగ్యం కుదుట పడి తిరిగి సినిమాల్లో రాణించాలని కోరుకుంటున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.