హీరో వినీత్.. తెలుగు సినీ ప్రియులకు పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ప్రేమదేశం సినిమాతో వినీత్ క్రేజ్ మారిపోయింది. 1996లో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఇందులో వినీత్, అబ్బాస్, టబు ప్రధాన పాత్రలలో నటించారు. ఇప్పటికీ ఈ మూవీ సాంగ్స్ ఎవర్ గ్రీన్. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ భాషలలో నటించి అభిమానులను సంపాదించుకున్నాడు. జెంటిల్ మెన్, సరిగమలు, ప్రేమదేశం,W/oవి. వర ప్రసాద్, నీ ప్రేమకై, రుక్మిణి, లాహిరి లాహిరి లాహిరిలో, చంద్రముఖి చిత్రాలు వినీత్ కు గుర్తింపు తెచ్చిపెట్టాయి. చాలా మందికి వినీత్ నటుడిగా మాత్రమే తెలుసు, కానీ అతను మంచి డాన్సర్ కూడా. వినీత్ భరతనాట్య కచేరీలలో తన ప్రతిభను ప్రదర్శించిన భరతనాట్య కళాకారుడు.
విదేశాల్లో పలు భరతనాట్య కార్యక్రమాల్లో పాల్గొంటూ ఏకాగ్రతతో ఉన్న వినీత్ ఈ కారణంగా పలు సినిమా అవకాశాలను కూడా వదులుకున్నాడు. వినీత్ మల్టీ టాలెంటెడ్ నటుడు, భరతనాట్య కళాకారుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, కొరియోగ్రాఫర్ కూడా. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న నితిన్.. ‘చంద్రముఖి’ తో రీఎంట్రీ ఇచ్చారు. తెలుగులో నితిన్ నటించిన రంగ్ దే సినిమాలో కనిపించాడు. వినీత్ ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. 2004లో ప్రిసిల్లా మీనన్‌ని వివాహం చేసుకున్నారు వినీత్. వీరికి ఒక కుమార్తె ఉంది. నటుడు వినీత్ తన భార్య , కుమార్తెతో ఉన్న ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
దీంతో వినీత్‌కు అంత పెద్ద కూతురా ఉందా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు.. ట్రావెంకూర్ సిస్టర్స్ గా పేరు గాంచిన రాగిణి, పద్మిని లలో పద్మిని భర్త డాక్టర్ రామచంద్రన్ కు వినీత్ మేనల్లుడు. అంతేకాకుండా సీనియర్ శోభనతో కలిసి భారత నాట్య కచేరీలలో పాల్గొంటాడు వినీత్. ప్రస్తుతం ఈ సీనియర్ హీరో ఫ్యామిలీ ఫోటోస్ వైరలవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.