ఒకే ఒక్క సినిమా ఆమె క్రేజ్ ను పెంచేసింది. తెలుగు ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్రవేసుకుంది ఆ బ్యూటీ. ఆమె అందం, అభినయం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆహా.. ఇంత అందం ఇన్నిరోజలు ఏమైపోయింది అని అంతా ఆశ్చర్యపోయారు. స్క్రీన్ మీద ఆమె కనిపిస్తే అలా చూస్తూనే ఉండిపోయారు. ఇంతలు పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? సడన్ గా చూస్తే ఎవరో అనుకుంటారు. అప్పటికి ఇప్పటికి ఆమె చాలా మారిపోయింది. మార్పు అంటే అలాంటి ఇలాంటి మార్పు కాదు.. అప్సరసలు కూడా అసూయా పడేలా మారిపోయింది ఆమె. పై ఫొటోలో హీరో శివాజితో ఉన్న హీరోయిన్ ఎవరంటే..
శివాజీ ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి మెప్పించారు. అలా ఆయన హీరోగా నటించిన సినిమాల్లో ఒకటి ఆలయం మూవీ. ఈ సినిమాలో శివాజీకి జోడీగా లయ నటించారు. అలాగే మరో హీరోయిన్ గా పై ఫొటోలో ఉన్న అమ్మడు నటించింది. ఆమె మరెవరో కాదు హాట్ బ్యూటీ హనీ రోజ్. అవును ఆమె హనీ రోజే.. చాలా మంది ఆమె తెలుగులో కొన్ని సినిమాలు చేసిందని తెలియదు. వీరసింహారెడ్డి సినిమానే ఆమె మొదటి తెలుగు సినిమా అనుకుంటున్నారు. కానీ కాదు.
హనీరోజ్ తెలుగు వీరసింహారెడ్డి సినిమా కంటే ముందు రెండు సినిమాల్లో నటించింది. శివాజితో ఆయలం, అలాగే వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ వర్షం సాక్షిగా అనే సినిమాలు చేసింది. కాకపోతే ఆ సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఆమె ఎవరికీ గుర్తులేదు. ఈ రెండు సినిమాల తర్వాత హనీరోజ్ తెలుగులో నటించలేదు. ప్రధానంగా మలయాళ బాషలోనే సినిమాలు చేసింది. అలాగే తమిళ్ లోనూ నటించింది. ఇక చాలా కాలం తర్వాత నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో హనీరోజ్ పేరు మారుమ్రోగింది. ఇక ఇప్పుడు రాచెల్ అనే సినిమా చేస్తుంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఇక సోషల్ మీడియాలో హనీరోజ్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.