Tollywood : బాబోయ్.. నెట్టింట గత్తరలేపుతున్న దండుపాళ్యం బ్యూటీ.. ఆమె ఇన్ స్టా చూస్తే..

దండుపాళ్యం సినిమా గుర్తుందా.. ? ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన సినిమా ఇది. ఇప్పటికీ టీవీల్లో సెన్సేషన్ అవుతుంది. అయితే ఈ సినిమా ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈ నటి గుర్తుందా.. ? ప్రస్తుతం ఆ నటి ఏం చేస్తుంది.. ఎక్కడ ఉంది అనే విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు.

Tollywood : బాబోయ్.. నెట్టింట గత్తరలేపుతున్న దండుపాళ్యం బ్యూటీ.. ఆమె ఇన్ స్టా చూస్తే..
Pooja Gandhi

Updated on: Sep 12, 2026 | 2:11 PM

తెలుగు, కన్నడ చిత్రసీమల్లో ఒకప్పుడు తీవ్ర సంచలనం సృష్టించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రాల్లో ‘దండుపాళ్యం’ సిరీస్ ఒకటి. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో దండుపాళ్యం గ్యాంగ్ చేసిన ఘోరాలు, క్రూరమైన హత్యలు, దోపిడీలు ప్రేక్షకులను తీవ్రంగా భయాందోళనకు గురిచేశాయి. ఈ చిత్రంలో ఎంతోమంది నటీనటులు ఉన్నప్పటికీ, తన రఫ్‌ అండ్ బోల్డ్ పర్‌ఫార్మెన్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి పూజా గాంధీ. కర్ణాటకకు చెందిన పూజా గాంధీ కన్నడ చిత్రసీమలో గ్లామరస్ హీరోయిన్‌గా ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ‘ముంగారు మలే’ వంటి బ్లాక్‌బస్టర్ లవ్ స్టోరీలతో కన్నడనాట స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందారు. కానీ ‘దండుపాళ్యం’ చిత్రంలో ఆమెను చూసి అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి.

ఎక్కువమంది చదివినవి : ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్.. చివరకు చనిపోయినప్పుడు బాడీకి తల లేదు.. ప్రేమ కన్నీళ్లు..

ఎలాంటి మేకప్ లేకుండా, గ్లామర్‌కు దూరంగా పక్కా నేరస్థురాలిగా ఆమె చూపించిన హావభావాలు, నటన సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాలో ఆమె నటించిన కొన్ని సీన్లు అప్పట్లో తీవ్ర వివాదాస్పదమయ్యాయి , సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీశాయి. దండుపాళ్యం సిరీస్ తర్వాత పూజా గాంధీ వెండితెరకు కొంతకాలం దూరమయ్యారు. రాజకీయాల్లోకి ప్రవేశించి కొంతకాలం బిజీగా గడిపిన ఆమె, ఆ తర్వాత తన వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టారు. ఇటీవల బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.

ఎక్కువమంది చదివినవి : Allari Naresh: అతడు ఒక కంప్లీట్ యాక్టర్.. డైలాగ్స్, ఫైట్స్ అన్నీ అద్భుతంగా చేస్తాడు.. అల్లరి నరేష్.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పూజా గాంధీకి సంబంధించిన లేటెస్ట్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తీవ్రంగా వైరల్ అవుతున్నాయి. దండుపాళ్యం సినిమాలో ఎంతో రఫ్‌గా, భయంకరంగా కనిపించిన పూజా గాంధీ.. రియల్ లైఫ్‌లో ఎంతో రాయల్‌గా, సంప్రదాయబద్ధంగా, అద్భుతమైన గ్లామర్‌తో కనిపిస్తున్నారు. ఆమె రూపాన్ని చూసిన నెటిజన్లు “దండుపాళ్యంలో భయపెట్టిన నటి ఈమేనా? ఇప్పుడు ఎంత గ్లామరస్‌గా మారిపోయారో!” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సినిమాలోని పాత్రకు, ఆమె నిజ జీవిత లుక్స్‌కు ఉన్న వ్యత్యాసం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఏడాదిలో 80 సినిమాలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్.. ఒక్కో సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్..

పూజా గాంధీ..

ఎక్కువమంది చదివినవి : Brahmaji : అన్నం పెట్టిన ఋణం తీర్చుకోవడానికి ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు.. నటుడు బ్రహ్మాజీ..

Loading...
Unable to load recommendations.
Follow Us