తెలుగులో రెండే సినిమాలు.. కట్ చేస్తే కోట్ల ఆస్తికి యువరాణి..! ఈ క్రేజీ హీరోయిన్ ఎవరో తెలుసా

తెలుగులో ఎంతో మంది ముద్దుగుమ్మలు తమ అందచందాలతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కానీ ఆతర్వాత టాలీవుడ్ కు దూరం అయ్యారు. తెలుగులో కొన్ని సినిమాలే చేసి ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసినవారు చాలా మంది ఉన్నారు. కొంతమంది ముద్దుగుమ్మలు ఒకటి రెండు సినిమాలతోనే పరిమితం అవుతున్నారు.

తెలుగులో రెండే సినిమాలు.. కట్ చేస్తే కోట్ల ఆస్తికి యువరాణి..! ఈ క్రేజీ హీరోయిన్ ఎవరో తెలుసా
Actress

Updated on: Sep 14, 2026 | 12:13 PM

తెలుగు చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి, ఆ తర్వాత బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన అందాల భామలు చాలామందే ఉన్నారు. కొందరు టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తుంటే.. మరికొందరు ఒకట్రెండు చిత్రాలకే పరిమితమై ఇతర భాషల వైపు అడుగులు వేస్తున్నారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. తెలుగులో ఈ అమ్మడు చేసింది రెండు సినిమాలే కానీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆతర్వాత ఇక్కడ అవకాశాలు అందుకోలేకపోయింది. కానీ  బాలీవుడ్ లో మాత్రం బ్యాక్ టు  బ్యాక్ సినిమాలు చేస్తుంది. ఆమె ఎవరో కాదు హాట్ బ్యూటీ దిశా పటానీ. తెలుగులో ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు తక్కువే అయినప్పటికీ, తన గ్లామర్‌, ఫిట్‌నెస్‌, ఫ్యాషన్‌తో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దిశా పటానీ 2015లో వచ్చిన ‘లోఫర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మెగా హీరో వరుణ్ తేజ్ సరసన ఆమె నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ‘లోఫర్’ తర్వాత దిశా పటానీ బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది.

Hanuman Ansh: చాలా డబ్బులు వచ్చాయి.. వాటిని ఏం చేసుకోవాలో అర్ధంకావడంలేదు..: హనుమాన్ అంశ్ నిర్మాత

ఆ తర్వాత 2024లో ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’లో దిశా పటానీ కీలక అతిథి పాత్రలో మెరిసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో దిశా పాత్ర నిడివి తక్కువగానే ఉన్నప్పటికీ, ఆమె లుక్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో లోఫర్ తర్వాత దిశా పటానీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. ఆ తర్వాత ‘బాఘీ 2’, ‘భారత్’, ‘మలంగ్’ వంటి చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా బాఘీ 2 సినిమా ఆమె కెరీర్‌లో మంచి విజయాన్ని అందించింది.

ఇవి కూడా చదవండి

వారణాసిపై పృథ్వీరాజ్ కామెంట్స్‌.. టైమ్ ట్రావెల్ మూవీ కాదు.. అంతకు మించి ఉంటుందట

ఇక సూర్య హీరోగా నటించిన తమిళ చిత్రం కంగువా’లోనూ దిశా పటానీ హీరోయిన్‌గా కనిపించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయినప్పటికీ దిశా పటానీకి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. దిశా పటానీ రెమ్యునరేషన్‌, ఆస్తుల వివరాలు మాత్రం దిమ్మతిరిగేలా చేస్తున్నాయి. ఈ బ్యూటీ నెట్ వార్త్ గురించి రెగ్యులర్ గా బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తుంటాయి.  ఈ భామ ఒక్కో సినిమాకు సుమారు రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.  గతంలో సూర్య నటించిన కంగువా చిత్రానికి దిశా పటానీ సుమారు రూ.3 కోట్ల పారితోషికం అందుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అలాగే సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, సోషల్ మీడియా ప్రమోషన్ల ద్వారా కూడా దిశా పటానీ ఆదాయం పొందుతున్నట్లు సమాచారం.మొత్తంగా ఈ అమ్మడు ఆస్తిపాస్తులు సుమారు రూ.75 కోట్లు ఉంటుందని అంచనా.

వారణాసిపై పృథ్వీరాజ్ కామెంట్స్‌.. టైమ్ ట్రావెల్ మూవీ కాదు.. అంతకు మించి ఉంటుందట

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us