Nani : నాని హీరోయిన్ ఎంతలా మారిపోయింది..! అప్పుడు క్యూట్‌గా.. ఇప్పుడు ఇలా

|

Aug 29, 2024 | 4:13 PM

సినిమా కథ ఎలా ఉన్నప్పటికీ నాని తన నటనతో ఆకట్టుకుంటాడు. నాని కెరీర్ లో చాలా సూపర్ హిట్స్ అందుకున్నాడు. అలాగే నాని నటించిన సినిమాల్లో ప్రేక్షకుల మనసుకు హత్తుకున్నా సినిమా భీమిలి కబడ్డీ జట్టు. ఈ మూవీ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. థియేటర్స్ లో ఈ సినిమా అంతగా ఆకట్టుకోకపోయినా.. నాని నటన ప్రేక్షకులను మెప్పించింది.

Nani : నాని హీరోయిన్ ఎంతలా మారిపోయింది..! అప్పుడు క్యూట్‌గా.. ఇప్పుడు ఇలా
Bheemili Kabaddi Jattu
Follow us on

నేచురల్ స్టార్ నాని కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. నాని సినిమా వస్తుందంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. సినిమా కథ ఎలా ఉన్నప్పటికీ నాని తన నటనతో ఆకట్టుకుంటాడు. నాని కెరీర్ లో చాలా సూపర్ హిట్స్ అందుకున్నాడు. అలాగే నాని నటించిన సినిమాల్లో ప్రేక్షకుల మనసుకు హత్తుకున్నా సినిమా భీమిలి కబడ్డీ జట్టు. ఈ మూవీ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. థియేటర్స్ లో ఈ సినిమా అంతగా ఆకట్టుకోకపోయినా.. నాని నటన ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో అమాయకపు యువకుడిగా నటించి అలరించాడు మన నేచురల్ స్టార్. ఇప్పటికీ ఈ సినిమా టీవీల్లో వస్తే ప్రేక్షకులు ఇంట్రెస్ట్ గా చూస్తారు.  తాతినేని సత్య దర్శకత్వంలో వచ్చిన భీమిలి కబడ్డీ జట్టు సినిమా 2010లో విడుదలైంది.

ఇది కూడా చదవండి : పెళ్లైన ముగ్గురితో ఎఫైర్స్.. వారిలో క్రికెటర్ కూడా.. ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే

కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ చిత్రమైన వెన్నిళ కబడి కుళుకు రీమేక్. అక్కడ ఈ సినిమా హిట్ అయ్యింది కానీ ఇక్కడ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమాలో నానికి జోడిగా శరణ్య మోహన్ నటించింది. ఈ  జంట ఎంతో చూడముచ్చగా అనిపించింది. శరణ్య మోహన్ తన క్యూట్ లుక్స్ తో ‘ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత ఈ చిన్నది పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయింది.

ఇది కూడా చదవండి :Tollywood : దుమ్మురేపిన దృశ్యం పాప..! అందాలతో గత్తర లేపిందిగా..

అయితే శరణ్య చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందం అభినయం ఉన్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో మూడు నాలుగు సినిమాలే చేసింది. కానీ శరణ్య మోహన్ తమిళ్, మలయాళ సినిమాల్లో ఎక్కువగా నటించింది. అలాగే కన్నడ, హిందీ సినిమాలోనూకనిపించింది మెప్పించింది ఈ చిన్నది. తెలుగులో నటుడు కృష్ణుడు హీరోగా చేసిన విలేజ్‌లో వినాయకుడు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది శరణ్య. ఆతర్వాత భీమిలి కబడ్డీ, హ్యాపీ హ్యాపీగా, కళ్యాణ్ రామ్ కత్తి సినిమాల్లో నటించింది. కళ్యాణ్ రామ్ కత్తి సినిమాలో ఆయన చెల్లెలిగా నటించి మెప్పించింది. ఇక శరణ్య ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. తన చిన్ననాటి స్నేహితుడు, వైద్యుడు అరవింద్ కృష్ణన్‌ను ఆమె 2015 లో వివాహం చేసుకుంది ఈ భామ. వీరికి ఇద్దరూ పిల్లలు ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ దర్శనమిస్తోంది ఈ బ్యూటీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.