
సినీరంగంలో స్టార్ కిడ్స్ అయినప్పటికీ ఆవగింజంత అదృష్టం కలిసిరావాల్సిందే. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీల పిల్లలు సరైన బ్రేక్ కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. అందులో ఈ స్టార్ కిడ్ ఒకరు. తండ్రి తోపు ప్రొడ్యూసర్. ఇక అతడి చెల్లెలు మాత్రం పాన్ ఇండియా లెవల్లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. కానీ అన్న మాత్రం ఇండస్ట్రీలో సక్కెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? కెరీర్ ప్రారంభంలోనే తన తల్లిని కోల్పోయాడు. ఆ తర్వాత, బాధ, పోరాటం, తనను తాను నిరూపించుకోవడానికి నిరంతర పోరాటం మొదలైంది. ఈ నటుడు ప్రేమలో మోసపోయాడు. అతడు మరెవరో కాదు.. అర్జున్ కపూర్.
కపూర్ కుటుంబానికి చెందిన అర్జున్ కపూర్ గురించి మీకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అర్జున్ కపూర్ తల్లిదండ్రులు బోనీ కపూర్ , మోనా శౌరీ కపూర్ 1995లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత, అర్జున్, అతని సోదరి అన్షుల తల్లి మోనా దగ్గరే పెరిగారు. నటుడిగా తెరంగేట్రం చేయడానికి ముందు 2003లో నిఖిల్ అద్వానీ చిత్రం ‘కల్ హో నా హో’కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అతను తన తండ్రి బోనీ కపూర్ ‘నో ఎంట్రీ’, ‘వాంటెడ్’ వంటి చిత్రాలకు కూడా సహాయం చేశాడు. ఆ తర్వాత 2012లో, పరిణీతి చోప్రా సరసన ‘ఇషాక్‌జాదే’ చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేశాడు. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కానీ ఆ సినిమా విడుదలకు ముందే అతడి తల్లి మోనా క్యాన్సర్ తో మరణించింది.
మొదటి సినిమాతోనే హిట్టు అందుకున్నప్పటికీ అతడి కెరీర్ ఆశించిన స్థాయిలో సాగలేదు. ఆ తర్వాత ఆయన ‘2 స్టేట్స్’, ‘ఫైండింగ్ ఫ్యానీ’, ‘కి అండ్ కా’, ‘గుండే’, ‘నమస్తే ఇంగ్లాండ్’, ‘పానిపట్’, ‘సర్దార్ కా గ్రాండ్సన్’, ‘భూత్ పోలీస్’, ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’, ‘ఏక్ విలన్ రిటర్న్స్’, ‘కుట్టే’ ‘ది లేడీ కిల్లర్’ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ హిట్టు మాత్రం రాలేదు. చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాడు.
ఇక రీల్ లైఫ్ కాదు.. రియల్ లైఫ్ సైతం అంత సవ్యంగా సాగలేదు. మలైకా అరోరాతో ప్రేమాయణం సాగించాడు. అప్పటికే మలైకా తన భర్తతో విడాకులు తీసుకుంది. ఆమె వయసులోనూ అర్జున్ కంటే పెద్దది కావడంతో.. అప్పట్లో వీరి డేటింగ్ నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది. కొన్నాళ్ల క్రితం వీరిద్దరు విడిపోయారు. మరోవైపు అర్జున్ అటు కెరీర్ పరంగా… ఇటు లైఫ్ పరంగా ఎంతో కష్టపడుతున్నాడు. అర్జున్ కపూర్ చెల్లెలు జాన్వీ కపూర్. ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో తోపు హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రామ్ చరణ్ సరసన పెద్ది చిత్రంలో నటిస్తుంది.
ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..
Janhvi Kapoor
ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..