టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. హీరోలతో సంబంధం లేకుండా కేవలం ఆయన సినిమాల కోసం ఎదురుచూస్తే అభిమానులున్నారు. ఎలాంటి కథనైనా.. తన స్టైల్లో యూత్‌కు కనెక్ట్ అయ్యేలా చూపించడంలో పూరి స్పెషల్. అలాగే ఆయన దర్శకత్వంలో నటించిన ప్రతి హీరోకు మాస్ ఇమేజ్ రావడం ఖాయం. అంతేకాకుండా.. ఒక్క సినిమాతోనే స్టార్ డమ్ క్రియేట్ చేయగల సత్తా ఉన్నా డైరెక్టర్. మాస్ మాహారాజా రవితేజ్ కెరీర్ ను ఇడియట్ సినిమాతో టర్న్ చేశారు. అలాగే పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కు బద్రి, మహేష్ బాబుకు పోకిరి.. ప్రభాస్ కు బుజ్జిగాడు.. వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు. ఇక తన సినిమాల్లోని డైలాగ్స్.. హీరో మేనరిజం మాస్ లెవల్. ఇండస్ట్రీలో వరుసగా భారీ విజయాలను అందుకున్న ఈ స్టార్ డైరెక్టర్స్.. కొందరిని నమ్మి ఆస్తులన్ని పోగొట్టుకున్నారు. ఈ సమయంలోనే వరుస ప్లాపులతో నెట్టుకోస్తున్నారు. గతంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మరోసారి సంచలనం సృష్టించిన ఆయన.. ఇటీవల విజయ్ దేవరకొండతో లైగర్ చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే తాజాగా పూరి జగన్నాథ్ పెళ్లికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.
పూరి జగన్నాథ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో లావణ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం. అయితే పూరి పెళ్లి చేసుకున్న సమయంలో తన చేతిలో చిల్లి గవ్వలేదట. తనది ప్రేమ వివాహం కావడంతో.. సీక్రెట్ గా గుడిలో చేసుకున్నారట. అప్పుడు తాళి బొట్టి కొనడానికి కూడా డబ్బులు లేకపోవడంతో.. ఆ టైములో యాంకర్ ఝాన్నీ తాళిబొట్టు కొనిపెట్టారట.
ఇక హేమ.. కూడా పెళ్లి బట్టలు పెట్టిందట. మిగిలిన స్నేహితులు కూల్ డ్రింక్స్ వంటివి స్పాన్సర్ చేశారని చెప్పారు పూరి. తను ఇండస్ట్రీలో పనిచేయడం స్టార్ట్ చేశాక.. బాగా సంపాదించానని.. కానీ కొందరిని నమ్మి డబ్బు పోగొట్టుకున్నాని.. తన పెళ్లికి సాయం చేసిన ఝాన్సీ, హేమ అలాగే.. తన స్నేహితులను ఎప్పటికీ మర్చిపోలేనని గతంలో పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.