Tollywood : పల్లెటూరి ముద్దుగుమ్మలు.. డీగ్లామర్ లుక్‌లో అలరిస్తున్న హీరోయిన్స్

|

Nov 01, 2023 | 11:39 AM

కేవలం పాటల కోసమే హీరోయిన్స్ అనే విధంగానూ సినిమాలు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు నయా ట్రెండ్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది. పెద్ద పెద్ద సినిమాల్లో హీరోయిన్స్ చాలా కీలకంగా ఉంటున్నారు. అందుకోసం అందాలను పక్కన పెటేసి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తున్నారు. హీరోయిన్స్ పాత్రలను తీర్చుదిద్దడంలో సుకుమార్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. 

Tollywood : పల్లెటూరి ముద్దుగుమ్మలు.. డీగ్లామర్ లుక్‌లో అలరిస్తున్న హీరోయిన్స్
Tollywood
Follow us on

టాలీవుడ్ లో ట్రెండ్ ఎప్పటికప్పుడు మారుతోంది. ఒకప్పుడు హీరోయిన్ అంటే చాలా పద్దతిగా చూడముచ్చటగా ఉండేలా పాత్రలు ఉండేవి. ఆ తర్వాత కొత్త ట్రెండ్ వచ్చింది. కేవలం గ్లామర్ కోసమే హీరోయిన్స్ పాత్రలు ఉండేవి. అది కూడా కొన్ని సంవత్సరాలు వర్కౌట్ అయ్యింది. ఆ తర్వాత కేవలం పాటల కోసమే హీరోయిన్స్ అనే విధంగానూ సినిమాలు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు నయా ట్రెండ్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది. పెద్ద పెద్ద సినిమాల్లో హీరోయిన్స్ చాలా కీలకంగా ఉంటున్నారు. అందుకోసం అందాలను పక్కన పెటేసి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తున్నారు. హీరోయిన్స్ పాత్రలను తీర్చుదిద్దడంలో సుకుమార్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. గతం రెండు సినిమాలల్లో హీరోయిన్ ను ఊర మాస్ పాత్రలో చూపించారు ఈ లెక్కల మాస్టర్.

ముందుగా రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమా గురించి మాట్లాడుకోవాలి. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈసినిమాలో హీరోయిన్ గా సమంత నటించింది. రంగస్థలం సినిమాలో సమంత డీ గ్లామర్ రోల్ లో కనిపించి ఆకట్టుకుంది. ఎప్పుడు స్టైలిష్ లుక్స్ లో అందంగా కనిపించే సమంత రంగస్థలం సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా చూపించాడు సుకుమార్.

అలాగే పుష్ప సినిమా విషయానికొస్తే పాన్ ఇండియా సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన సినిమాకే హైలైట్. ఏకంగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది బన్నీ యాక్టింగ్ కి. ఇక ఈ సినిమా రష్మిక మందన్న పాత్ర కూడా మాస్ గా ఉంటుంది. పాలు అమ్ముకునే యువతిగా చూపించాడు సుకుమార్.

తాజాగా జాన్వీ కపూర్ కూడా ఇదే తరహా మాస్ పాత్రలో కనిపించనుంది. జాన్వీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో నటిస్తుంది ఈ బ్యూటీ తాజాగా ఈ మూవీ నుంచి తన లుక్ ను లీక్ చేసింది జాన్వీ పల్లటూరి యువతిగా లంగా ఓణిలో కనిపించింది జాన్వీ. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పల్లెటూరి అమ్మాయిల గెటప్ లో హీరోయిన్స్ అందం డబుల్ అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.