Trivikram: త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన మరో గొప్ప జీవిత పాఠం.. ఫెయిల్యూర్స్‌ పై ఆయన ఏమన్నారో మీరే చూడండి

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనగానే సినిమాలతో పాటు ఆయన నోటి నుంచి వచ్చే పదునైన మాటలు, డైలాగులే బాగా గుర్తుంటాయి. తాజాగా ఆయన తన సినిమా ఫెయిల్యూర్ టైంలో తనకు తన భార్య, పిల్లల మధ్య జరిగిన సంభాషణ గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Trivikram: త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన మరో గొప్ప జీవిత పాఠం.. ఫెయిల్యూర్స్‌ పై ఆయన ఏమన్నారో మీరే చూడండి
Director Trivikram Srinivas

Updated on: Aug 26, 2026 | 4:33 PM

మాటల మాంత్రికుడు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన సినిమాలతో పాటు అందులో ఆయన చెప్పిన పదునైన మాటలు, డైలాగులు చాలా బాగా గుర్తుండిపోతాయి. సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లలోనూ త్రివిక్రమ్ చెప్పే మాటలు, ఇచ్చే స్పీచులు ఎంతో ఆసక్తికరంగా ఉండిపోతాయి. అలా తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఓ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు మాటల మాంత్రికుడు. ఈ సందర్భంగా ఆయన ఫెయిల్యూర్స్ ను ఎలా తీసుకోవాలో సూచిస్తూ ఓ అద్భుతమైన ప్రసంగం ఇచ్చారు. ఈ సందర్భంగా తన కెరీర్ లో ఫ్లాప్ గా నిలిచిన అజ్ఞాత వాసి సినిమాను ఉదహరిస్తూ ఆ సమయంలో తనకు తన భార్య, పిల్లల మధ్య జరిగిన సంభాషణను పంచుకున్నారు.

ఫెయిల్యూర్‌ని దాచి పెట్టడం వల్ల మనసు ఎక్కువ బరువుగా అనిపిస్తుంది. నేను ఇల్లు కట్టుకుంటోన్న సమయంలోనే ‘అజ్ఞాతవాసి’ సినిమాను తెరకెక్కించాను. ఇది ఫ్లాప్ అవ్వడంతో సినిమా రిలీజైన 24 గంటల్లోనే రెమ్యునరేషన్ మొత్తం వెనక్కిచ్చేయాల్సి వచ్చింది. నిర్మాత కూడా తనకు మిగిలిన లాభం వెనక్కిచ్చేశాడు. పవన్ కల్యాణ్ కొంత రెమ్యునరేషన్ వెనక్కిచ్చారు. అలా మొత్తం అందరికీ సెటిల్ చేసేశాం. అయితే ఈ విషయాన్ని నా భార్య, పిల్లలకు చెప్పడం ముఖ్యం అనుకున్నాను. నేనో సినిమా తీశాను అది ఆడలేదు. కాబట్టి మనం కడదామనుకుంటున్న ఇల్లు ఆపేద్దామనుకుంటున్నాను. మీకేమైనా సమస్యనా? రేపొద్దునా తేడా ఏమైనా వస్తే దాన్ని అమ్మేస్తానని అనగానే.. ఇది ఉంది కదా ఇది కూడా ఇల్లే కదా అని అన్నారు. దీంతో అది సమస్య కాదని అనిపించింది . ఆ తర్వాత భోజనం చేసి సంతోషంగా ఓ సినిమా చూసి పడుకున్నాను’

ఇవి కూడా చదవండి

‘సినిమా పోయిన విషయాన్ని దాచి పెట్టి యజమానిగా ఇప్పుడా అదనంగా ఆ బరువుని కూడా మోయాలి. ఇదెవరికీ చెప్పకూడదు. భార్య, పిల్లలకు తెలియకూడదు. తెలియకూడదని మనం అనుకోవడం తప్ప ప్రపంచానికి అంతా తెలిసిన తర్వాత ఇంట్లో వాళ్లకు ఎందుకు తెలియకుండా ఉంటుంది. ముందు వాళ్లకే కదా తెలుస్తుంది. కాకపోతే గౌరవంతో వాళ్లు మనకు చెప్పరంతే. చెప్పేయడం వల్ల మనకు ముందు మన మనసు తేలిగ్గా ఉంటుంది. ఇదేమైనా పెద్ద సమస్య అనే ఫీలింగ్ వాళ్లకు అనిపించదు. లేదంటే వాళ్లు కూడా వీడెందుకు మొహం అలా పెట్టుకుని లోపల అలా కూర్చున్నాడు బయటకు రావట్లేదు ఏంటిది అని వాళ్లు కూడా వాళ్లింట్లోనే వేరే వాళ్ల ఇంట్లో ఉన్నట్లు చూస్తారు. ఇదంతా ఎలా ఉంటుందంటే.. సినిమా మనం తీసి టార్చర్ వాళ్లకు పెట్టినట్లు ఉంటుంది’ అని జీవిత సారాన్ని వివరించారు త్రివిక్రమ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us