
సాధారణంగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు ప్రతి చిన్న విషయం గురించి తనదైన స్టైల్లో స్పందిస్తుంటారు. తాజాగా గ్లోబల్ మ్యూజిక్ ఐకాన్, దివంగత కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్ గురించి ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. మైఖేల్ జాక్సన్ బయోపిక్ ‘Michael’ చూసిన తర్వాత ఆర్జీవీ ఎమోషనల్ అవుతూ సుధీర్ఘ ట్వీట్ చేశారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే ఫరా ఖాన్, అనుపమ్ ఖేర్‌తో సహా పలువురు భారతీయ సెలబ్రిటీలు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఇక శుక్రవారం, ఆర్జీవీ ఆ సినిమా చూసిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక భావోద్వేగభరితమైన నోట్‌ను పంచుకున్నారు. అందులో తనకు మైఖేల్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. 2009 జూన్ 25న మైఖేల్ జాక్సన్ మరణించిన ఆ చేదు జ్ఞాపకాన్ని వర్మ గుర్తు చేసుకున్నారు.
“నాకు మైఖేల్ అంటే అసహ్యం. మైఖేల్ సినిమా చూసిన తర్వాత, నాకు ఆ భయంకరమైన రోజు. 2009 జూన్ 25న ఆ ఘోరమైన రోజు నాకు ఇంకా గుర్తుంది. ఉదయం నిద్ర లేవగానే టీవీ స్క్రీన్‌పై వస్తున్న వార్త చూసి షాక్ అయ్యాను. మొదట అదొక పీడకల అనుకున్నాను, ఇలాంటి దారుణమైన కల నాకు ఎందుకు వస్తుందని భావించాను. కానీ టీవీలో స్క్రోలింగ్ మారుతూనే ఉంది. వేరే ఛానల్స్ మార్చి చూసినా అందరూ అదే గంభీరమైన స్వరంతో జాక్సన్ మరణ వార్తను చదువుతున్నారు. అప్పుడే నమ్మశక్యం కాని నిజం జరిగిపోయిందని నాకు అర్థమైంది. మైఖేల్ జాక్సన్ చనిపోవడం వల్ల.. అతను కూడా మనలాంటి సాధారణ మనిషే అని నాకు తెలిసి వచ్చింది. అందుకే అతను చనిపోయినందుకు నాకు కోపం, ద్వేషం” అంటూ వర్మ ఎమోషనల్ అయ్యారు.
తన ఇంజనీరింగ్ కాలేజ్ రోజుల్లో మైఖేల్ జాక్సన్ క్రేజ్ తనను ఎలా ఊపేసిందో వర్మ వివరించారు. “1984 జనవరి 2న విజయవాడలో నా ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో, నా స్నేహితుడు నన్ను ఒక చిన్న వీడియో పార్లర్‌కు బలవంతంగా తీసుకెళ్లాడు. అక్కడ లైట్లు ఆపేసి మైఖేల్ జాక్సన్ ‘థ్రిల్లర్’ (Thriller) సాంగ్ ప్లే చేశారు. అది నన్ను ఒక రేంజ్‌లో కదిలించేసింది. అది కేవలం ఒక పాట లేదా డాన్స్ కాదు.. అదొక సునామీ. అప్పటివరకు సంగీతం, విజువల్స్ పట్ల నాకున్న ఆలోచనలనే అది పూర్తిగా మార్చేసింది” అని వర్మ పేర్కొన్నారు.
జాక్సన్ చేసిన ‘బీట్ ఇట్’, ‘బిల్లీ జీన్’, ‘స్మూత్ క్రిమినల్’, ‘బ్యాడ్’ వంటి సాంగ్స్ తనతో పాటు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమందికి ఎప్పటికీ రీచ్ కాలేని ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచిపోయాయని ఆర్‌జీవీ అన్నారు. తన కెరీర్ మొత్తంలో, తన బృందంతో గానీ లేదా ఇతర దర్శకులతో గానీ పాటల చిత్రీకరణపై జరిగిన చర్చలు తరచుగా మైఖేల్ జాక్సన్ మ్యూజిక్ వీడియోల చుట్టూనే తిరిగేవని ఆర్జీవీ తెలిపారు. “మైఖేల్ జాక్సన్ చనిపోయినందుకు నేను అతడిని ద్వేషిస్తున్నాను. తను కూడా ఒక మనిషే అని నిరూపించినందుకు నేను అతడిని ద్వేషిస్తున్నాను. మనందరిలాగే అతనికి కూడా ఆక్సిజన్, రక్తం అవసరమయ్యాయన్న విషయాన్ని నేను ద్వేషిస్తున్నాను. అతని గుండె కూడా కొట్టుకోవడం ఆగిపోగలదన్న విషయాన్ని నేను ద్వేషిస్తున్నాను. అతను నాకు వెన్నుపోటు పొడిచాడు. నా కలను మోసం చేశాడు. మైఖేల్, నా కలను పీడకలగా మార్చినందుకు నేను నిన్ను ద్వేషిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మాటల్లో చెప్పలేనంతగా నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఇప్పుడు ఎక్కడ, ఏ లోకంలో ఉన్నా, నక్షత్రాలు కూడా ఇముడ్చుకోలేని అద్భుతమైన కాంతితో అంతరిక్ష తుఫానులను సృష్టిస్తూ, గెలాక్సీల మీదుగా మూన్‌వాక్ చేస్తున్నావని నాకు ఖచ్చితంగా తెలుసు. విజయవాడలోని ఆ వీడియో పార్లర్‌లో నువ్వు నాకు ఇచ్చిన ఆ మైమరపును నేను చనిపోయేంత వరకు నాలో మోసుకెళ్తాను.” అంటూ రాసుకొచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Gunashekar: ఆ హీరో చిన్నప్పుడు కూచిపూడి డ్యాన్స్ చేస్తే.. రవింద్రభారతిలో విజిల్స్ మారుమోగాయి.. డైరెక్టర్ గుణశేఖర్..
I HATE MICHAEL
After watching MICHAEL film , my memory went back to that horrible day June 25 th , 2009 when I slept late with the television still murmuring like a ghost in the darkness of my room , and as I groggily woke up in the morning and my eyes went to the screen to see…
— Ram Gopal Varma (@RGVzoomin) May 22, 2026
ఎక్కువ మంది చదివినవి : Surya S/o Krishnan: హార్ట్ టచింగ్.. కుర్రాళ్ల మనసును కదిలించే సాంగ్.. ‘చంచల’ పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..