Rahul Ravindran: భార్య, పిల్లలపై అభ్యంతరకర కామెంట్స్.. రాహుల్ రవీంద్రన్ సంచలన నిర్ణయం

ఇటీవల సోషల్ మీడియాలో నెగెటివిటీ బాగా పెరిగిపోతుంది. ముఖ్యంగా కొంతమంది నెటిజన్లు సెలబ్రిటీలను టార్గెట్ గా చేసుకుని ద్వేషపూరిత కామెంట్స్‌ చేస్తున్నారు. తద్వారా వారిని తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తున్నారు. తాజాగా ప్రముఖ నటుడు, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ విషయంలో ఇదే జరిగింది.

Rahul Ravindran: భార్య, పిల్లలపై అభ్యంతరకర కామెంట్స్.. రాహుల్ రవీంద్రన్ సంచలన నిర్ణయం
Rahul Ravindran

Updated on: Jun 30, 2026 | 5:56 PM

సెలబ్రిటీ  కపుల్ రాహుల్ రవీంద్రన్, చిన్మయి శ్రీపాదల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమాలతో పాటు వీరికి సామాజిక స్పృహ ఎక్కువ. సమాజంలో జరిగే అన్యాయాలపై తమదైన శైలిలో స్పందిస్తుంటారు. అయితే అదే ఇప్పుడు రాహుల్ రవీంద్రన్ ఫ్యామిలీకి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల పుణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ కాబోయే భార్య చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ రాహుల్ రవీంద్రన్ ను ట్యాగ్ చేస్తూ ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాలాగే పురుషులపై జరుగుతున్న అన్యాయాలపై కూడా సినిమా తీయాలని కోరాడు. దీనికి స్పందించిన రాహుల్ సొసైటీలో ఇప్పటికీ పితృస్వామ్య భావజాలం బలంగా ఉందని మహిళలకు సపోర్టుగా మాట్లాడాడు. అంతే రాహుల్ రవీంద్రన్ పై ట్రోలింగ్ మొదలైంది. కొందరు అతన్ని దూషించడమే కాకుండా, ఆయన సతీమణి చిన్మయి, పిల్లలపై కూడా పర్సనల్ ఎటాక్స్ చేశారు. ముఖ్యంగా రాహుల్ పిల్లను చంపేస్తామని బెదిరింపుల దాకా వచ్చాయి. దీంతో మనస్థాపానికి గురైన రాహుల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఓ నెటిజన్ తన పిల్లలను చంపేస్తానని బెదిరిస్తూ చేసిన కామెంట్స్‌ని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా షేర్ చేస్తూ.. ట్విట్టర్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

‘ఫిఫా వరల్డ్ కప్ లో బ్రెజిల్‌, జపాన్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూస్తున్న సమయంలో ఫుట్‌బాల్‌ ఆటకు సంబంధించిన ట్విటర్‌ అకౌంట్‌ కోసం ఈ యాప్‌(ఎక్స్‌) ఓపెన్‌ చేశా. పొరపాటున కొన్ని నోటిఫికేషన్లు చూశా. అవి చదివిన తర్వాత నా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అక్కడ కనిపించిన కామెంట్స్ నాలో తీవ్ర కోపం, ఆవేదన కలిగించాయి. ఆ కామెంట్‌ చేసిన వాడిని ఎలాగైనా వెతికి పట్టుకొని ఏదైనా చేయాలన్న ఆలోచన నా మైండ్‌లోకి వచ్చింది. సాధారణంగా కోపం వచ్చినప్పుడు మామూలుగా నేను నన్ను నేను శాంతించుకోమని చెప్పుకొంటాను. కానీ ఈసారి అలా చేయాలనిపించలేదు. ఇక ఈ యాప్‌తో నా పని అయిపోయింది. కొంతకాలంగా దీని నుంచి బయటపడాలని అనుకుంటున్నాను. అందుకే నా ఫోన్ నుంచి ఈ యాప్‌ను తొలగిస్తున్నాను’అని రాహుల్‌ రవీంద్రన్‌ ట్విట్టర్ (ఎక్స్) లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

రాహుల్ రవీంద్రన్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us