K. Raghavendra Rao: విరాటపర్వం సినిమా పై ప్రశంసలు కురిపించిన దర్శకేంద్రుడు..

|

Jun 18, 2022 | 7:55 PM

ఊపిరికి ఊపిరికి మధ్య ఊపిరి సలపనంత యుద్దం..! ఆ యుద్దం మధ్యలో..! చిట్టడవిలో..! నట్టనడి రాతిరిలో పుట్టిన వెన్నెల.! అదే యుద్దాన్ని నడిపిస్తున్న ఓ అన్నకు ..

K. Raghavendra Rao: విరాటపర్వం సినిమా పై ప్రశంసలు కురిపించిన దర్శకేంద్రుడు..
K. Raghavendra Rao
Follow us on

ఊపిరికి ఊపిరికి మధ్య ఊపిరి సలపనంత యుద్దం..! ఆ యుద్దం మధ్యలో..! చిట్టడవిలో..! నట్టనడి రాతిరిలో పుట్టిన వెన్నెల.! అదే యుద్దాన్ని నడిపిస్తున్న ఓ అన్నకు .. విప్లవ భావోద్యేగాలు వెదజల్లే ఆయన పెన్నుకు.. వెన్నెల దాసోహమైతే..! అరణ్య బాట పట్టి.. రవన్న మనసు గెలుచుకోడానికి..! మనువాడడానికి వెళ్తే.! అరణ్య రోదనే కదా ఆమె కథ..! విరాట పర్వమే(Virata Parvam) కదా ఆమె వ్యధ! ఇప్పుడీ కథే.. వెన్నెల వ్యధే తెలుగు రాష్ట్రాలను భావోద్వేగమయ్యేలా చేస్తోంది. సినిమా చూసేందుకు ఎగబడేలా చేస్తోంది.1990లో సరళ అనే అమ్మాయి నిజ జీవితంలో జరిగిన యధార్ధ సంఘటనలు ఆధారంగా ఈ చిత్రాన్ని అత్యున్నత స్థాయిలో తెరకెక్కించారు. డి. సురేష్ బాబు స‌మ‌ర్పణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఎపిక్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి భారీ ఆదరణ

ఎస్ ! వేణూ ఊడుగుల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా కామన్‌ ఆడియెన్స్‌నే కాదు.. సెలబ్రిటీలను కూడా ఫిదా చేస్తోంది. ఇక తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును కూడా కదిలించింది. తాజాగా విరాట పర్వం సినిమా చూసిన రాఘవేంద్ర రావు ఈ సినిమా టీంను మెచ్చకున్నారు. మస్ట్ వాచ్ ఫిల్మ్ అంటూ ఒక్క మాటలో రివ్యూ ఇచ్చారు. సాయి పల్లవి అద్భుతంగా నటించింది . వేణు అనుభవం ఉన్న దర్శకుడిగా సినిమాను తెరకెక్కించారని మెచ్చుకున్నారు దర్శకేంద్రుడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి