తండ్రి స్టార్ క్రికెటర్.. భర్త బడా ప్రొడ్యూసర్..! ఈ బ్యూటీ ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా, విలన్స్ గా చేసి ప్రేక్షకులను మెప్పించారు. అలాంటి వారిలో ఈ బ్యూటీ ఒకరు. లేడీ విలన్ గా నటవిశ్వరూపం చూపించి ప్రేక్షకులను కవ్వించింది ఈ అమ్మడు. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? విలన్ గానే కాదు హీరోయిన్ గాను సినిమాలు చేసింది.

తండ్రి స్టార్ క్రికెటర్.. భర్త బడా ప్రొడ్యూసర్..! ఈ బ్యూటీ ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్
Actress

Updated on: Aug 03, 2026 | 9:30 PM

సినిమా రంగంలో తమదైన ముద్ర వేసుకున్న నటీమణులలో అందాల భామ శ్రియా రెడ్డి ఒకరు. తమ నటనతో తక్కువ సినిమాలే చేసినా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న శ్రియా రెడ్డి, సినీ నేపథ్యం లేని కుటుంబం నుండి వచ్చి స్వయంకృషితో ఎదిగారు. ఈమె విభిన్నమైన కుటుంబ నేపథ్యం, సినీ ప్రస్థానం గురించి తెలుసుకుందాం.. శ్రియా రెడ్డి స్కూల్ రోజుల నుంచే మోడలింగ్ లో రాణించింది. అయితే చదువుకు ఆటంకం కలగకూడదని కొంతకాలం మోడలింగ్ కు దూరంగా ఉంది. వయసు పెరిగే కొద్దీ ఆమెకు నటనపై ఆసక్తి పెరిగింది. డిగ్రీ చదివే రోజుల్లో సౌత్ ఇండియా మ్యూజిక్ ఛానెల్ అయిన ఎస్ఎస్ మ్యూజిక్ లో VJ (వీడియో జాకీ) ఆడిషన్స్ కు వెళ్లి విజేతగా నిలిచింది. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండానే వీడియో జాకీగా బుల్లితెర రంగాన్ని ఓ ఊపు ఊపింది. తన యాంకరింగ్ తో టీఆర్పీ రేటింగ్స్ ను టాప్ లెవెల్ కు తీసుకెళ్లి, స్టార్ హీరోయిన్ లా స్టార్ డమ్ సంపాదించుకుంది.

ఇది కూడా చదివేసేయండి : అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్‌లాంటి స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఒక్క హిట్ కూడా లేదు.. ఇప్పుడు ఇలా

వీడియో జాకీ తెలుగులోనే సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ, ఆమెకు పెద్ద బ్రేక్ ఇచ్చినది మాత్రం తమిళ సినిమానే. తెలుగులో అప్పుడప్పుడు సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేశారు. అయితే ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడం వల్ల తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ, తమిళ, మలయాళ భాషల్లో ఆమెకు వరుస అవకాశాలు లభించాయి. తమిళంలో కాంచీవరం, మలయాళంలో భరత్ చరణ్ ఐపీఎస్ వంటి సినిమాల్లో శ్రియా రెడ్డి నటనకు గాను ప్రతిష్టాత్మక ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకున్నారు. తెలుగులో పందెంకోడి పేరుతో డబ్ అయిన విశాల్ తమిళ చిత్రం థామరైలో శ్రియా రెడ్డి పూర్తి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఇది కూడా చదివేసేయండి : సూపర్ స్టార్ కృష్ణ కాలర్ పట్టుకున్న హీరో.. కటౌట్లు తగలబెట్టి , థియేటర్లపై దాడి చేసిన అభిమానులు

హీరోని పెళ్లి చేసుకోవాలన్న పట్టుదలతో మొండి ఘటంగా కనిపించిన ఆమె నటనకు ప్రేక్షకులు, విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఆ పాత్రలో ఆమె అద్భుతమైన నటనకు మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత గుర్రం గంగరాజు నిర్మించిన అమ్మ చెప్పింది సినిమాలో కూడా తన నటనతో మంచి గుర్తింపు పొందారు. శ్రియా రెడ్డి వ్యక్తిగత జీవితం కూడా సినిమాటిక్ గా ఉంటుంది. ఆమె 1973లో ఇండియన్ టీం క్రికెటర్ అయిన భరత్ రెడ్డి కుమార్తె. ఇది చాలా మందికి తెలియని విషయం. అంతేకాకుండా, ఆమె ప్రేమించి వివాహం చేసుకున్న ప్రొడ్యూసర్ విక్రమ్ కృష్ణ స్వయానా స్టార్ హీరో విశాల్ అన్నయ్య. ఈ విధంగా, శ్రియా రెడ్డి తండ్రి ప్రముఖ క్రికెటర్ కాగా, భర్త పెద్ద నిర్మాత, మరిది స్టార్ హీరో. రియల్ లైఫ్ లో ఆమె ఒక స్టార్ హీరోకు మరిదిగా ఉంటూ, అతని అన్నను పెళ్లాడిన అరుదైన బంధాన్ని కలిగి ఉన్నారు. శ్రియా రెడ్డి సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదివేసేయండి : ఆ విలన్ చెప్పే డైలాగ్స్, యాక్షన్ అంటే బాలయ్యకు అంత ఇష్టమా.. సెట్‌లో దగ్గరుండి మరీ చూసేవారట

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us