
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. ఇక ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అలాగే ఆతర్వాత తెరకెక్కిన పుష్ప 2 సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. పుష్ప 2 సినిమా వెయ్యికోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇండియాలోనే ఫాస్టెస్ట్ 1000కోట్లు వసూల్ చేసిన సినిమాగా పుష్ప 2 సినిమా రికార్డ్ బ్రేక్ చేసింది. పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా రూ.1265 కోట్లు వసూలు చేసింది.
ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ తన నట విశ్వరూపం చూపించాడు. ముఖ్యంగా జాతర సీన్ లో అల్లు అర్జున్ అద్భుతంగా నటించాడు. అలాగే ఈ సినిమాలో యాక్షన్స్ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలిచాయి. ఇదిలా ఉంటే పుష్ప సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్నాను అని ఓ హీరో గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. చివరి నిమిషంలో పుష్ప సినిమాలో ఛాన్స్ మిస్ అయ్యిందని అని చెప్పుకొచ్చాడు. ఆ హీరో ఎవరో కాదు. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నా రోహిత్.
నారా రోహిత్ భైరవం సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ పుష్ప సినిమా ఛాన్స్ మిస్ అయ్యిందని తెలిపాడు. పుష్ప సినిమాలో భన్వర్‌సింగ్ షెకావత్ పాత్ర ముందుగా తనకే వచ్చిందని తెలిపాడు రోహిత్. కరోనా టైమ్‌లో నేను మీసాలతో ఉన్న ఫోటోను నిర్మాత నాకు పంపించి పుష్ప సినిమాలో షెకావత్ పాత్ర గురించి చెప్పారు నాకు కూడా బాగా నచ్చింది. కానీ సుకుమార్ పుష్ప సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కించాలని చూస్తున్నారని అందుకోసం అన్ని బాషల నుంచి నటులను తీసుకుంటున్నారని.. అలాగే షెకావత్ పాత్ర కోసం ఫహద్ ఫాజిల్ ను ఎంపిక చేశారని నారా రోహిత్ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ వైరల్ అవ్వడంతో.. మంచి ఛాన్స్ మిస్ అయ్యిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ పాత్ర చేసి ఉంటే రోహిత్ కెరీర్ టర్న్ అయ్యేది అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..