Dhurandhar 2 Collections: బాక్సాఫీస్ విస్పోటనం.. ధురందర్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..

ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైంది 'ధురందర్ 2'. ఇప్పటికే మొదటి భాగం బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. సెకండ్ పార్ట్ పై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాకు మొదటి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్, సారా అర్జున్ జోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ధురంధర్ 2 సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

Dhurandhar 2 Collections: బాక్సాఫీస్ విస్పోటనం.. ధురందర్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..
Dhurandharr

Updated on: Mar 20, 2026 | 10:50 AM

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన స్పై యాక్షన్ సినిమా ‘ధురందర్ 2: ది రివెంజ్’. ఉగాది పండగ సందర్భంగా మార్చి 19న భారీ అంచనాల మధ్య విడుదలైంది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 3 గంటల 30 నిమిషాలు ఉన్న ఈ సినిమాను దర్శకుడు ఆదిత్య ధర్ ఎక్కడా బోర్ కొట్టకుండా తెరకెక్కించాడని అంటున్నారు అడియన్స్. గతేడాది విడుదలైన ధురంధర్ మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ క్రమంలోనే ధురంధర్ 2 పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. రెండవ భాగం నిజ సంఘటనల ఆధారంగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందింది. పెద్ద నోట్ల రద్దు, ఉరి దాడి వంటి కీలక సంఘటనలను చూపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆమెకు 15.. అతడికి 24.. పదేళ్లుగా సీక్రెట్ లవ్.. కట్ చేస్తే.. భార్యభర్తలుగా ఒక్కటైన హీరోహీరోయిన్..

నివేదికల ప్రకారం ధురంధర్ 2 సినిమా విడుదలకు ముందే రూ.30 కోట్లకు పైగా వసూలు చేసినట్లు టాక్. మొదటి రోజు ఈ సినిమా థియేటర్లలో రూ. 103 కోట్ల వరకు వసూలు చేసింది. ఇది కేవలం భారతదేశవ్యాప్త వసూళ్లు మాత్రమే. ఈ చిత్రాన్ని మొదటి రోజు ప్రత్యేక ప్రదర్శనల ద్వారా కూడా విడుదల చేశారు. దీని ద్వారా రూ. 43 కోట్లు వసూలు కాగా, నివేదిక ప్రకారం మొదటి రోజు మొత్తం వసూళ్లు సుమారు రూ. 172.63 కోట్లుగా ఉన్నాయి. అయితే ఈ కలెక్షన్స్ గురించి చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించలేదు.

ఎక్కువమంది చదివినవి : Appa Rao: ఆ సినిమా సమయంలో చేసిన పని.. నా ఫేస్ మొత్తం బ్లాక్ అయ్యింది.. జబర్దస్త్ అప్పారావు..

ధురందర్ 2, సన్నీ డియోల్ తాజా చిత్రం బోర్డర్ 2, షారుఖ్ ఖాన్ రెండు భారీ బ్లాక్‌బస్టర్‌లైన జవాన్ , పఠాన్‌ల రికార్డులను బద్దలు కొట్టింది. బోర్డర్ 2 మొదటి రోజున 6,078 షోలలో 37% ఆక్యుపెన్సీ రేటుతో రూ. 30 కోట్లు వసూలు చేసింది. ఇది ధురందర్ 2: ది రివెంజ్ మొదటి రోజు వసూళ్ల కంటే చాలా తక్కువ. షారుఖ్ ఖాన్ ‘జవాన్’ విషయానికి వస్తే ప్రారంభ వసూళ్లు రూ. 75.40 కోట్లు కాగా, ‘పఠాన్’ భారతదేశంలో రూ. 55-57 కోట్లు సంపాదించింది. రణ్‌వీర్ కేవలం షారుఖ్, సన్నీ డియోల్‌లను అధిగమించడమే కాకుండా, ‘స్త్రీ 2’ (రూ. 54 కోట్లు), ‘యానిమల్’ (రూ. 64 కోట్లు) వంటి ఇతర హిందీ చిత్రాల రికార్డులను కూడా బద్దలు కొట్టాడు .

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లును సుడిగాలి సుధీర్‏కు అమ్మేశా.. టాలీవుడ్ నటుడు..

ఎక్కువమంది చదివినవి : Jabardasth Naresh: నెలకు 13 ఈవెంట్స్ చేస్తా.. ఒక్కో ఈవెంట్‏కు ఎంత తీసుకుంటానంటే.. జబర్దస్త్ నరేష్..

Follow Us