Pandu Master: బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ల జాబితాలో పండు మాస్టర్ పేరు! మరి డాక్టర్లు ఏం చెబుతున్నారో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రియాలిటీ షో కంటెస్టెంట్ల జాబితాలో పండు మాస్టర్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే ఉన్నట్లుండి అతను రోడ్డు యాక్సిడెంట్ బారిన పడ్డాడు. మరి పండు మాస్టర్ బిగ్ బాస్ లోకి వస్తాడా? అసలు అతని హెల్త్ కండీషన్ ఎలా ఉందో తెలుసుకుందాం రండి.

Pandu Master: బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ల జాబితాలో పండు మాస్టర్ పేరు! మరి డాక్టర్లు ఏం చెబుతున్నారో తెలుసా?
Pandu Master

Updated on: Jun 12, 2026 | 8:21 PM

ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు పండు మాస్టర్. తన సూపర్బ్ డ్యాన్స్ మూమెంట్స్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఓ టీవీ షోలో ‘నాది నక్కిలీసు గొలుసు’ అనే పాటకు లేడీ గెటప్ లో పండు మాస్టర్ వేసిన స్టెప్పులు సోషల్ మీడియాను షేక్ చేశాయి. పండు మాస్టర్ పెర్ఫామెన్స్ కారణంగానే ‘నాది నక్కిలీసు గొలుసు’ అనే పాట కూడా బాగా ఫేమస్ అయ్యింది. అన్నట్లు పండు మాస్టర్ లో కేవలం డ్యాన్సింగ్ ట్యాలెంటే కాదు.. అతని కామెడీ టైమింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఢీ షోతో పాటు ఇతర టీవీ షోల్లో తన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు పండు మాస్టర్. ప్రస్తుతం ‘ఢీ 20’ డ్యాన్స్ రియాలిటీ షోలోనూ ఒక కంటెస్టెంట్ గా వ్యవహరిస్తున్నాడీ కొరియో గ్రాఫర్. మొన్నటివరకు ‘ఈ సాలా కప్ నామ్ దే’ అంటూ సందడి చేసిన పండు మాస్టర్ ఉన్నట్లుండి రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు అందులోనూ సరిగ్గా కాళ్లకు తీవ్రమైన గాయాలు కావడం పండు మాస్టర్ అభిమానులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది.

ఇదిలా ఉంటే పండు మాస్టర్‌కు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న బిగ్ బాస్ 10 రియాలిటీ షోలోనూ కంటెస్టెంట్ గా పాల్గొనే ఛాన్స్ కూడా వచ్చిందట. పండు మాస్టర్ కూడా ఈ షోకు వెళ్లాలనే యోచనలో ఉన్నాడట. అయితే ఇంతలోనే ఈ దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో రకరకకాల పుకార్లు వినిపిస్తున్నాయి. పండు మాస్టర్ కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని, అతను ఇప్పట్లో డ్యాన్స్ చేయడం కష్టమేనని.. ఇలా రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. వీటిని చూసి పండు అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ పుకార్లలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. పండు మాస్టర్ కు అవసరమైన సర్జరీ బాగా సక్సెస్ అయ్యిందని డాక్టర్లు చెబుతున్నారు. అతను మూడు నెలల్లో పూర్తి స్థాయిలో కోలుకుంటాడని చెబుతున్నారు. అదృష్టం ఉండి, అన్ని విషయాలు కలిసొస్తే బిగ్ బాస్ 10 లోనూ పండు మాస్టర్ పాల్గొనే అవకాశాలున్నాయంటున్నారు.

ఏదేమైనా పండు మాస్టర్ త్వరగా కోలుకోవలని, మునపటిలా అతను మళ్లీ డ్యాన్స్ చేయాలని అతని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us