Dhanush: ఇళయరాజా బయోపిక్‏లో ధనుష్.. ‘మ్యూజిక్ మేస్ట్రో’ ఫస్ట్ లుక్ రిలీజ్..

|

Mar 20, 2024 | 3:28 PM

ఆయన అందించిన సంగీతం శ్రోతల హృదయాలను కట్టిపడేసింది. అందుకే ఆయనను మ్యూజిక్ మేస్ట్రో అని పిలుచుకుంటారు. ఇప్పటికీ ఆయన పాటలకు వేలాది మంది అభిమానులు ఉన్నారు. ఇళయరాజా పాటలు వింటే సంగీతంతో ప్రేమలో పడిపోవడం ఖాయం. 80 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన సంగీతం అందిస్తూ శ్రోతలను మైమరపిస్తున్నారు. 30 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో సంగీత దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన పాటలను అందిస్తున్న ఆయన జీవితం ఇప్పుడు సినిమాగా రాబోతుంది.

Dhanush: ఇళయరాజా బయోపిక్‏లో ధనుష్.. మ్యూజిక్ మేస్ట్రో ఫస్ట్ లుక్ రిలీజ్..
Dhanush, Ilayaraja
Follow us on

సినీ సంగీత ప్రపంచంలో ఇళయారాజా రారాజు. మూడు దశాబ్దాల సినీ ప్రయాణంలో వివిధ భాషలలో దాదాపు ఐదు వేలకు పైగా పాటలు.. 1000కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. 1970 సంగీత దర్శకుడిగా సినీ ప్రయాణం మొదలుపెట్టి.. ఇప్పటికీ తన మ్యూజిక్‏తో శ్రోతలను మంత్రముగ్దులను చేస్తున్నారు. దక్షిణ భారత సంగీతంలో పాశ్చాత్య సంగీతంలోని విశాలమైన, వినసొంపైన జిలుగులను ప్రవేశపెట్టారు. ఉత్తమ సంగీత దర్శకునిగా నాలుగుసార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. ఆయన అందించిన సంగీతం శ్రోతల హృదయాలను కట్టిపడేసింది. అందుకే ఆయనను మ్యూజిక్ మేస్ట్రో అని పిలుచుకుంటారు. ఇప్పటికీ ఆయన పాటలకు వేలాది మంది అభిమానులు ఉన్నారు. ఇళయరాజా పాటలు వింటే సంగీతంతో ప్రేమలో పడిపోవడం ఖాయం. 80 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన సంగీతం అందిస్తూ శ్రోతలను మైమరపిస్తున్నారు. 30 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో సంగీత దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన పాటలను అందిస్తున్న ఆయన జీవితం ఇప్పుడు సినిమాగా రాబోతుంది.

ఇళయరాజా జీవితాన్ని సినిమాగా తీసుకురాబోతున్నారు. మ్యూజిక్ మేస్ట్రో బయోపిక్‏లో ఇళయరాజా పాత్రలో కోలీవుడ్ హీరో ధనుష్ నటిస్తున్నారు. ఇన్నాళ్లు ఈ ప్రాజెక్ట్ గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. కానీ ఇప్పుడు ఇళయారాజా బయోపిక్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు ఇళయారాజా అని టైటిల్ ఫిక్స్ చేశారు… అలాగే ది కింగ్ ఆఫ్ మ్యూజిక్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఈ చిత్రానికి అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో కెప్టెన్ మిల్లర్ వంటి యాక్షన్ సినిమాతో హిట్ అందుకున్నాడు అరుణ్ మాథేశ్వరన్. ఇళయారాజా సినిమా ప్రారంభోత్సవం ఈరోజు చెన్నైలోని లీలా ప్యాలెస్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి విశ్వనటుడు కమల్ హాసన్ హాజరయ్యారు. అలాగే ఈ చిత్రంలో కమల్ హాసన్, రజనీకాంత్, శింబు తదితరులు ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. చెన్నై రోడ్ల మీద ఇళయారాజా హార్మోనియం పెట్టే పట్టుకుని అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లు ఉంది.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ధనుష్ మాట్లాడుతూ.. తన చిరకాల కోరిక ఒకటి నెరవేరిందని అన్నారు. తన కోరికలు రెండు ఉన్నాయని.. ఒకటి ఇళయరాజా.. మరొకటి రజినీకాంత్ బయోపిక్ లలో నటించాలని కోరికలు ఉన్నాయని అన్నారు ధనుష్. ప్రస్తుతం ఇళయరాజా బయోపిక్‏లో నటిస్తున్నానని అన్నారు. ఇక రజినీకి ధనుష్ వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. ఆయన కూతురు ఐశ్వర్యతో విడాకులు తీసుకున్నప్పటికీ రజినీ సినిమాలకు సపోర్ట్ చేస్తుంటాడు ధనుష్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.