Corona Wave in Tollywood: టాలీవుడ్ లో కరోనా కల్లోలం.. కోవిడ్ బారిన పడిన అల్లు అరవింద్.. త్రివిక్రమ్ కూడా కరోనా అంటూ టాక్..!

|

Apr 04, 2021 | 11:52 AM

Corona Wave in Tollywood: దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ సునామీ సృష్టిస్తుంది. అన్ని రంగాల వారితో పాటు .. సినీ రంగ ప్రాముఖ్యలు కూడా కోవిడ్ బారిన పడుతున్నారు. ఇక టాలీవుడ్ లో వరసగా ప్రముఖులు..

Corona Wave in Tollywood: టాలీవుడ్ లో కరోనా కల్లోలం.. కోవిడ్ బారిన పడిన అల్లు అరవింద్.. త్రివిక్రమ్ కూడా కరోనా అంటూ టాక్..!
Corona Waves In Tollywood
Follow us on

Corona Wave in Tollywood: దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ సునామీ సృష్టిస్తుంది. అన్ని రంగాల వారితో పాటు .. సినీ రంగ ప్రాముఖ్యలు కూడా కోవిడ్ బారిన పడుతున్నారు. ఇక టాలీవుడ్ లో వరసగా ప్రముఖులు కరోనా బాధితులు అవుతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తాజా మూవీ వకీల్ సాబ్ లో నటించిన నివేదా థామస్ కరోనా పాజిటివ్ . ఇక ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ కూడా కరోనా బారినపడినల్టు తెలుస్తోంది. అయితే తాజగా మౌన ముని , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కరోనా బారిన పడినల్టు తెలుస్తోంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉంటూ చికిత్సను పొందుతున్నారని తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక త్రివిక్రమ్ ఓ వైపు స్వీయ దర్శకత్వం లో సినిమా తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేస్తూనే.. మరోవైపు పవన్ కళ్యాణ్ సినిమా కోసం మాటలను సిద్ధం చేస్తున్నారు. మాటల రచయితగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా తనదైన ముద్రవేశారు. అటు కుటుంబ ప్రేక్షకులతో పాటు, ఇటు మాస్‌ను మెప్పించగల దర్శకుడు. తెలుగు పాదాలకు పట్టంగడుతూ.. చిన్న చిన్న సంభాషణలు, మాటలతోనే ఒక సాధారణ సన్నివేశాన్ని కూడా అద్భుతం అనిపించేలా చిత్రీకరించడం అయన శైలీ..

Also Read: డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థినులకు రూ. 50 వేలు స్కాలర్ షిప్..ఎలా అప్లై చేసుకోవాలంటే..!
శాస్త్రీయ పద్ధతిలో ఎకరం భూమిలో టమాటా పంట సాగు.. నీటి ఆదాతో పాటు.. లక్షలు ఆర్జిస్తున్న రైతు.. ఎక్కడంటే..!