Bheemla Nayak: భీమ్లా నాయక్ సినిమాలో కామెడీ కింగ్ బ్రహ్మానందం పాత్ర అదుర్స్.. బ్రహ్మీ గెటప్‌ పోస్టర్‌ విడుదల

|

Dec 08, 2021 | 5:44 AM

Bheemla Nayak: బ్రహ్మానందం.. తెలుగు పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను నవ్వులు పూయించాడు. తెలుగు తెరపై చెగని చిరువ్వును..

Bheemla Nayak: భీమ్లా నాయక్ సినిమాలో కామెడీ కింగ్ బ్రహ్మానందం పాత్ర అదుర్స్.. బ్రహ్మీ గెటప్‌ పోస్టర్‌ విడుదల
Follow us on

Bheemla Nayak: బ్రహ్మానందం.. తెలుగు పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను నవ్వులు పూయించాడు. తెలుగు తెరపై చెగని చిరువ్వును శాశ్వతంగా ఉంచిన కమెడియన్‌లలో బ్రహ్మానందం ఒకరు. తాజాగా బ్రహ్మానందం భీమ్లానాయక్‌ సినిమాలో నటించారు. ఆ సినిమాలో బ్రహ్మానందం లుక్‌ విడుదలైంది. ఇందులో బ్రహ్మీ పోలీసు పాత్రలో నటిస్తున్నారు. అయితే బ్రహ్మానందం ఉన్నాడంటే సినిమాలో కమెడీ అదర్స్‌ అని చెప్పాలి. ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రను కామెడీ కింగ్ బ్రహ్మానందం చేయబోతుండడం విశేషంగా మారింది. ఇటీవల ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో బ్రహ్మానందం ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే నిర్మాతలు కూడా ఆ విషయాన్ని వెల్లడించారు. పోలీస్ గెటప్ లో ఉన్న బ్రహ్మానందం పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన భీమ్లానాయక్‌ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం వహించగా, తమన్‌ మ్యూజిక్‌ అందించారు. అయితే మలయాళంలో సూపర్‌ హిట్‌ అందించిన అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇవి కూడా చదవండి:

Naga Shaurya : ఆయన ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టాను… కానీ ఒక్కసారి కూడా చూడలేదు: నాగశౌర్య

K.G.F: Chapter 2: శరవేగంగా కేజీఎఫ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు.. డబ్బింగ్ పూర్తి చేసిన అధీరా..