
డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విక్రమ్ చియాన్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం కోబ్రా (Cobra ). యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విక్రమ్ సరసన కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించగా.. మీనాక్షి, మృణాళిని కీలకపాత్రలలో కనిపించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా.. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు. ఇక ట్రైలర్‌తోనే ఈ మూవీపై భారీ అంచనాలను నెలకొల్పారు మేకర్స్. ఇందులో విక్రమ్ గణీత శాస్త్రవేత్తగా కనిపించనుండడంతో మూవీపై మరింత ఆసక్తి పెరిగింది. ఎన్నో అంచనాల రూపొందించిన ఈమూవీ ఈరోజు వినాయక చవితి సందర్బంగా (ఆగస్ట్ 31న) తెలుగు, హిందీ, తమిళంలో విడుదలైంది. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు.
విక్రమ్ కమ్ బ్యాక్.. ఫస్ట్ హాఫ్ వేరేలెవల్ అని.. ఇక సెకండ్ పార్ట్ మరింత అద్భుతంగా ఉందని అంటున్నారు. ప్రతినాయకుడిగా నటించిన ఇర్ఫాన్ పఠాన్ ఫస్ట్ మూవీతోనే నటనతో అదరగొట్టారని.. అతని రోల్ ఆకర్షణీయంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
ట్వీట్..
చాలా సంవత్సరాల తర్వాత విక్రమ్ సరైన సినిమాలో నటించారని.. తప్పకుండా చూడాల్సిందేనంటున్నారు.
ట్వీట్..
ప్రేక్షకుల అంచనాలు అందకుండా ఊహించలేనివిధంగా ఇంటర్వెల్ తర్వాత సీన్స్ ఉన్నాయని.. మరోసారి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌తో మెప్పించాడని కామెంట్స్ చేస్తున్నారు. విక్రమ్ పర్ఫామెన్స్ అదిరిపోయిందని అంటున్నారు.
ట్వీట్..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.