Chiranjeevi: మరో లీక్ ఇచ్చిన మెగాస్టార్.. గాడ్ ఫాదర్ నుంచి కీలక అప్డేట్

|

Jun 18, 2022 | 3:42 PM

Telugu Indian Idol winner BVK Vagdevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మెగాస్టార్. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేక పోయింది

Chiranjeevi: మరో లీక్ ఇచ్చిన మెగాస్టార్.. గాడ్ ఫాదర్ నుంచి కీలక అప్డేట్
Chiranjeevi
Follow us on

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆచార్య(Acharya)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మెగాస్టార్. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేక పోయింది. ఇక ఇప్పుడు మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ అనే సినిమా చేస్తున్నారు చిరు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్ ను మెగాస్టార్ లీక్ చేశారు. గతంలో చిరంజీవి ఆచార్య సినిమా టైటిల్ ను పొరపాటున లీక్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి మెగాస్టార్ గాడ్ ఫాదర్ నుంచి ఓ లీక్ ఇచ్చారు.

ఇటీవల ఆహా నిర్వహించిన తెలుగు ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఫైనల్ లో మెగాస్టార్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ బిగెస్ట్ సింగింగ్ కాంపిటేషన్ లో వాగ్దేవి విజేతగా నిలిచింది. అలాగే ‘గాడ్ ఫాదర్’లో ఓ సెంటిమెంట్ సాంగ్ ని పాడే ఛాన్స్ ని సొంతం చేసుకుంది. తన సినిమాలో పాట పడే అవకాశం వచ్చిందని తమన్ చేతే చెప్పించారు చిరు. తమన్ మాట్లాడుతూ.. గాడ్ ఫాదర్ సినిమాలో అన్న చెల్లెళ్ళ మధ్య వచ్చే సెంటిమెంట్ సాంగ్ వాగ్దేవి పడిందని చెప్పాడు తమన్. చాలా కాలంగా ఈ సినిమాలో నయనతార, చిరంజీవి అన్న చెల్లెళ్ళు గా నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా మెగాస్టార్ ఇచ్చిన లీక్ తో ఆ వార్తలు వాస్తవమే అని అర్ధమవుతుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి