Singer P.Susheela: గాయని సుశీలకు గౌరవ డాక్టరేట్.. ప్రధానం చేసిన సీఎం స్టాలిన్..

|

Nov 21, 2023 | 12:34 PM

నవంబర్ 21న డాక్టర్ జయలలిత మ్యూజిక్ అండ్ గావిన్ యూనివర్శిటీ 2వ స్నాతకోత్సవం చెన్నైలోని కలైవానర్ అరంగంలో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ ఛాన్సలర్, ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరయ్యారు. యూనివర్సిటీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలు అందించేశారు. అనంతరం సినీ సంగీత పరిశ్రమలో గానకోకిల పి. సుశీలకు ముఖ్యమంత్రి స్టాలిన్ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తమిళ అభివృద్ధి, కళాసంస్కృతి, సమాచార శాఖ మంత్రి, యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ఎం.పి.సామినాథన్‌ పాల్గొన్నారు.

Singer P.Susheela: గాయని సుశీలకు గౌరవ డాక్టరేట్.. ప్రధానం చేసిన సీఎం స్టాలిన్..
Singer P.susheela
Follow us on

తెలుగు సినీ పరిశ్రమలో అద్భుత గాయని గానకోకిల పీ.సుశీలకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు తమిళనాడు సీఎం ఎంకే. స్టాలీన్. ఈరోజు నవంబర్ 21న డాక్టర్ జయలలిత మ్యూజిక్ అండ్ గావిన్ యూనివర్శిటీ 2వ స్నాతకోత్సవం చెన్నైలోని కలైవానర్ అరంగంలో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ ఛాన్సలర్, ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరయ్యారు. యూనివర్సిటీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలు అందించేశారు. అనంతరం సినీ సంగీత పరిశ్రమలో గానకోకిల పి. సుశీలకు ముఖ్యమంత్రి స్టాలిన్ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తమిళ అభివృద్ధి, కళాసంస్కృతి, సమాచార శాఖ మంత్రి, యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ఎం.పి.సామినాథన్‌ పాల్గొన్నారు. అలాగే సంగీత విద్వాంసుడు పీఎం సుందరంకు కూడా గౌరవ డాక్టరేట్ అందించి సన్మానించారు సీఎం స్టాలిన్.

సినీ సంగీతం ప్రపంచంలో తన గాన మాధుర్యంతో కోట్లాది శ్రోతల హృదయాలను మైమరపించారు. తెలుగు సినీ రంగంలో దాదాపు 50వేలకు పైగా పాటలు పాడి అలరించారు. అలాగే తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, సింహళ ఇలా ఎన్నో భాషలలో పాటలు పాడి మంత్రముగ్దులను చేశారు. దశాబ్దాలుగా ఎవర్ గ్రీన్ పాటలతో సినీ సంగీత ప్రపంచాన్ని ఏలిన మహారాణి పీ.సుశీల.

Susheela, Mk Stalin

పి. సుశీల విజయనగరంలో 1935 నవంబర్ 13న జన్మించారు సుశీల. 1950 సంవత్సరంలో రేడియోలో నిర్వహించిన పోటీలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఏ.ఎమ్.రాజాతో కలిసి తెలుగులో కన్నతల్లి అనే సినిమాతో నేపథ్య గాయనిగా అరంగేట్రం చేసింది. పద్మభూషణ్ అవార్డు, ఐదుసార్లు జాతీయ అవార్డు, మూడుసార్లు తమిళనాడు ప్రభుత్వ అవార్డుతో సహా అనేక అవార్డులు అందుకున్నారు పి.సుశీల. గతేడాది ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర పోస్టల్ శాఖ ఆమె పేరు మీదు ప్రత్యేక తపాలా స్టాంపును ఆవిష్కరించింది. 2017లో సైమా లైఫ్ లైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.