Tollywood: అమ్మ బాబోయ్.. బిందాస్ మూవీ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది..!

|

Sep 14, 2024 | 1:54 PM

బిందాస్ మూవీ హీరోయిన్ గుర్తు ఉందా..? అప్పట్లో ఈ బ్యూటీకి ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉండేది. కుర్రాళ్లు ఆమె ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమ కలల సుందరిగా పేర్కొనేవారు. ఇంతకీ తను ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తోంది...

Tollywood: అమ్మ బాబోయ్.. బిందాస్ మూవీ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది..!
Sheena Shahbadi
Follow us on

హిట్స్, ప్లాప్స్ అన్న సంగతి పక్కనబెడితే.. మంచు మనోజ్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అతను విభిన్నమైన కంటెంట్ ఎంచుకుంటాడని ప్రేక్షకుల నమ్మకం. మనోజ్ నటించిన బిందాస్ సినిమా చాలా బాగుంటుంది. కానీ అప్పట్లో ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ అయితే భారీగానే వచ్చాయి. సినిమాలో మనోజ్ కామెడీ టైమింగ్, ఎనర్జీ లెవల్స్ నెక్ట్స్ లెవల్‌లో ఉంటాయి. ఇక మనోజ్‌కు జోడిగా ఈ సినిమాలో నటించిన బ్యూటీ గుర్తుందా..? తన పేరు..  పేరు షీనా షహబాది. అమ్మడి గ్లామర్‌కి అప్పట్లో కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. ఈ ముద్దుగుమ్మ  బిందాస్ సినిమా తర్వాత నందీశ్వరుడు, యాక్షన్ 3డి, నువ్వే నా బంగారం, గడ్డం గ్యాంగ్ వంటి తెలుగు చిత్రాల్లో కనిపించింది. అలాగే 2, 3 టీవీ సిరీస్‌లలో నటించి వెండితెరకు దూరమైంది.

వైభవ్ గోర్‌ను పెళ్లాడింది షీనా. ఇప్పుడు కంప్లీట్ ప్రైవేట్ లైఫ్ లీడ్ చేస్తోంది. అప్పట్లో తమ కలల సుందరి అయిన షీనా ఇప్పుడు ఎలా ఉందో చూడాలని చాలామంది ఫ్యాన్స్ నెట్టింట సెర్చ్ చేస్తున్నారు. అందుకే ఈ హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలను మీ ముందుకు తెచ్చాం. ట్రెండీ లుక్స్‌తో అప్పటికంటే మరింత చార్మింగ్‌ మెరిసిపోతుంది ఈ బ్యూటీ. ఈ అమ్మడు చూసిన నెటిజన్స్ వన్నె తగ్గని బ్యూటీ అని కామెంట్ పెడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.