అమ్మబాబోయ్..!! మహేష్ సినిమాలో కనిపించిన ఈ అమ్మడని ఇప్పుడు చూస్తే వెర్రెక్కి పోవాల్సిందే.

|

Jun 20, 2024 | 5:06 PM

ఊరిని దత్తత తీసుకునే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మహేష్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. 2015 లో వచ్చిన ఈ సినిమాలో మహేష్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా స్పూర్తితో రెండు గ్రామాలను కూడా దత్తత తీసుకున్నారు మహేష్ బాబు. ఆతర్వాత చాలా మంది ఈ గ్రామాలను దత్తత తీసుకోవడానికి ఆసక్తి చూపించారు.

అమ్మబాబోయ్..!! మహేష్ సినిమాలో కనిపించిన ఈ అమ్మడని ఇప్పుడు చూస్తే వెర్రెక్కి పోవాల్సిందే.
Tollywood
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో శ్రీమంతుడు సినిమా ఒకటి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు  సినిమా తర్వాత మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే, ఆగడు సినిమాలు అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దాంతో ఫ్యాన్స్ మహేష్ నుంచి ఓ సాలిడ్ హిట్ కావాలని ఎదురు చూశారు. అదే సమయంలో వచ్చింది శ్రీమంతుడు. ఊరిని దత్తత తీసుకునే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మహేష్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. 2015 లో వచ్చిన ఈ సినిమాలో మహేష్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా స్పూర్తితో రెండు గ్రామాలను కూడా దత్తత తీసుకున్నారు మహేష్ బాబు. ఆ తర్వాత చాలా మంది ఇలా గ్రామాలను దత్తత తీసుకోవడానికి ఆసక్తి చూపించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ సినిమాలో ఓ అందాల భామ కూడా కనిపిస్తుంది.

పై ఫొటోలో ఉన్న బ్యూటీని ఎవరో గుర్తుపట్టారా.? శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబుతో కలిసి కాఫీ తాగే సన్నివేశంలో కనిపించింది ఈ చిన్నది. ఆమె ఎవరు.? ఇప్పుడు ఆమె ఎలా ఉంది.? అని చాలా మంది నెటిజన్స్ గూగుల్ లో గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది.

అలాగే బికినీ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఆమె పేరు సనమ్ శెట్టి. ఆమె పూర్తి పేరు సనమ్ ప్రసాద్ శెట్టి. అంబులి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ చిన్నది. ఆతర్వాత తమిళ్ లో వరుసగా సినిమాలు చేసింది. అలాగే శ్రీమంతుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత సంపూర్ణేష్ బాబు నటించిన సింగం 123, ప్రేమికుడు సినిమాల్లో నటించింది. తమిళ్, కన్నడ భాషల్లో ఎక్కువగా సినిమాలు చేసింది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన అందాలతో మతిపోగొడుతోంది. ఈ అమ్మడి ఫోటోలకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది.

సనమ్ శెట్టి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

సనమ్ శెట్టి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.