Bigg Boss 8: దీపికాకు బంపర్ ఆఫర్.. బిగ్ బాస్ సీజన్ 8‌లో బ్రహ్మముడి నటి..?

రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచిన ఈ సీజన్ లో చాలా డ్రామాలు జారిగాయి. స్పై బ్యాచ్, స్పా బ్యాచ్ అనే రెండు గ్రూపులుగా హౌస్ మేట్స్ విడిపోయి పోటీపడ్డారు మధ్యలో శివాజీ పెద్దరికం ఇవ్వని కలిపి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అంతే కాదు సీజన్ చివరిలో ఫినాలే రోజు జరిగిన సంఘటనలు కూడా హైలైట్ అనే చెప్పలి. సీజన్ 7 ఫినాలే తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట పెద్ద బీభత్సం జరిగింది.

Bigg Boss 8: దీపికాకు బంపర్ ఆఫర్.. బిగ్ బాస్ సీజన్ 8‌లో బ్రహ్మముడి నటి..?
Bigg Boss 8
Follow us

|

Updated on: Jun 18, 2024 | 6:05 PM

బిగ్ బాస్ సీజన్ 8 సిద్దమవుతుంది. బిగ్ బాస్ వస్తుందంటే చాలు ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అవుతుంది. ఇప్పటికే బిగ్ బాస్ ఏడూ సీజన్స్ పూర్తి చేసుకొని ఎనిమిదో సీజన్ లోకి అడుగు పెట్టుకుంది. ఇప్పటి వరకు వచ్చిన సీజన్స్ కంటే సీజన్ మంచి రసవత్తరంగా సాగింది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచిన ఈ సీజన్ లో చాలా డ్రామాలు జారిగాయి. స్పై బ్యాచ్, స్పా బ్యాచ్ అనే రెండు గ్రూపులుగా హౌస్ మేట్స్ విడిపోయి పోటీపడ్డారు మధ్యలో శివాజీ పెద్దరికం ఇవ్వని కలిపి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అంతే కాదు సీజన్ చివరిలో ఫినాలే రోజు జరిగిన సంఘటనలు కూడా హైలైట్ అనే చెప్పాలి. సీజన్ 7 ఫినాలే తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట పెద్ద బీభత్సం జరిగింది. ఫ్యాన్స్ పేరుతో కొంతమంది నానా రచ్చ చేశారు.

వాహనాలను ధ్వంసం చేశారు. ఆర్టీసీ బస్సు పై కూడా దాడి చేసి ధ్వంసం చేశారు. దాంతో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. అంతే కాదు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 7 పుణ్యమా అని ఇంత రచ్చ జరిగింది. దాంతో టీఆర్పీ రేటింగ్ కూడా భారీగా పెరిగిపోయింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. త్వరలోనే సీజన్ 8 ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి

అయితే బిగ్ బాస్ ఆగస్టులో ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. అలాగే ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరే అంటూ కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో వైరాల్ గా మారాయి. అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఓ సీరియల్ నటి కూడా ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు బ్రహ్మముడి సీరియల్ తో మంచి పేరు తెచ్చుకున్న కావ్య ( దీపికా రంగరాజు ). బ్రహ్మముడి సీరియల్ లో దీపికా కావ్య పాత్రలో అద్భుతంగా నటించి మెప్పిస్తుంది. ఈ సీరియల్ చూసే ఆడియన్స్ కు ఆమె ఫెవరెట్ నటిగా మారిపోయింది. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఈ చిన్నది అడుగు పెట్టనుందని తెలుస్తోంది. అలాగే ఇదే సీరియల్ లో నటిస్తున్న హమీద, మానస్ కూడా గత బిగ్ బాస్ సీజన్స్ లో పాల్గొన్నారు. దాంతో ఇప్పుడు దీపికా కూడా పాల్గొంటుందని తెలుస్తోంది. ఈవార్తల్లో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఇదే టాక్ తెగ షికారు చేస్తుంది. మరి ఈ అమ్మడు బిగ్ బాస్ లోకి అడుగు పెడుతుందో లేదో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.