దెయ్యాలుగా మారిన అందాల భామలు.. ఎవరో గుర్తుపట్టారా .? తెలిస్తే షాక్ అవుతారు

|

Oct 10, 2024 | 9:15 AM

అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో 'భూల్ భూలయ్య 3' ఒకటి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. కొద్ది రోజుల క్రితం వచ్చిన టీజర్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ట్రైలర్‌ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ లో భయాపెట్టే సన్నివేశాలు చాలా కనిపిస్తున్నాయి.

దెయ్యాలుగా మారిన అందాల భామలు.. ఎవరో గుర్తుపట్టారా .? తెలిస్తే షాక్ అవుతారు
Bhool Bhulaiyaa 3
Follow us on

అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘భూల్ భూలయ్య 3’ ఒకటి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. కొద్ది రోజుల క్రితం వచ్చిన టీజర్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ట్రైలర్‌ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ లో భయాపెట్టే సన్నివేశాలు చాలా కనిపిస్తున్నాయి. విద్యాబాలన్, కార్తీక్ ఆర్యన్, మాధురీ దీక్షిత్, త్రిప్తి దిమ్రీ ఈ సినిమాలో నటించారు. ఈ ఏడాది దీపావళి సందర్భంగా ‘భూల్ భూలయ్య 3’ సినిమా విడుదల కానుంది. ట్రైలర్ ద్వారా క్యూరియాసిటీ పెంచిన ఈ సినిమాని చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

‘భూల్ భూలయ్య’, ‘భూల్ భూలయ్య 2’ సినిమాల్లో మంజూలిక పాత్ర హైలైట్ గా నిలిచిన విషయం తేలిసిందే. ఇప్పుడు ‘భూల్ భూలయ్య 3’ సినిమాలో ఆ పాత్రకు ప్రాధాన్యత ఉండనుంది. ట్విస్ట్ ఏంటంటే.. ఈసారి ఇద్దరు మంజూలిక పాత్రలో నటించారు. మంజూలికగా మాధురీ దీక్షిత్, విద్యాబాలన్ కనిపించనున్నారు. మాధురీ దీక్షిత్, విద్యాబాలన్‌లలో అసలు మంజూలిక ఎవరో తెలియాలంటే ‘భూల్ భూలయ్య 3’ సినిమా చూడాల్సిందే.

అనీస్ బాజ్మీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నవంబర్ 1న విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోందని నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇది కేవలం హారర్ సినిమా మాత్రమే కాదు. ఈ సినిమాలో హారర్‌తో పాటు కామెడీ కథ కూడా ఉంటుందని ట్రైలర్‌ని బట్టి అర్థమవుతోంది. దెయ్యాలు అంటే భయపడే ప్రేక్షకులు కూడా కామెడీ సన్నివేశాలను బాగా ఎంజాయ్ చేస్తారు. విజయ్ రాజ్, సంజయ్ మిశ్రా, రాజ్‌పాల్ యాదవ్ వంటి కమెడియన్స్  ఈ చిత్రంలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ అందరి ప్రశంసలు అందుకుంటోంది. ‘భూల్ భూలయ్య 3’ సినిమాతో కార్తీక్ ఆర్యన్ కెరీర్‌లో మరో పెద్ద విజయాన్ని అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.